తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
December 13, 2016
ఒక్క ఫోన్ కాల్…. అయ్యా వర్షాలకు మా ప్రాంతం నీట మునిగింది, ఆదుకోండి అని. అంతే 15 నిమిషాల్లో అక్కడకు చేరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు పరుగున అక్కడికి చేరుకొని నీరు బయటకు పోయే అవకాశాలున్న చోట గండ్లు కొట్టించారు. అంతే 2 గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. స్థానిక 23 వ వార్డు జనశక్తి నగర్ లో ఓ ప్రాంతంలోని 30 కుటుంబాలు నీట మునగగా తన దృష్టికి ఫోన్ ద్వారా చేరిన సమాచారానికి కోటంరెడ్డి స్పందన ఇది. అక్కడి ప్రజలకు భరోసా కల్పించే విధంగా సహాయక చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే. ప్రక్కన అపార్టుమెంట్ వాసులతో మాట్లాడి పేదలకు ఇబ్బందులు కలిగే క్రమంలో ఆశ్రయం ఇవ్వాలని కోరారు. పేదలకు భోజన ఏర్పాట్లు రెవెన్యూ మరియు స్థానిక నాయకుల సహకారంతో ఏర్పాటు చేయించారు. తమకు భరోసా కలిగించినందుకు ఎమ్మెల్యే కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిగా ఎమ్మెల్యే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయండని, తక్షణం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెవెన్యూ, కార్పొరేషన్, పోలీసు శాఖల వారిని అభినందించారు. తుఫాను సమయంలో చక్కటి సహాయక ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్ గున్ని మరియు ఇతర సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో కార్పొరేటర్ పాతపాటి పుల్లారెడ్డి, 23 డివిజన్ వైసీపీ ఇన్ ఛార్జ్ శ్రీనివాసులు రెడ్డి, రమణయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.