తీరనున్న కరెన్సీ కష్టాలు – మార్కెట్లోకి క్రొత్త 500 నోట్లు
November 13, 2016
రూ.500, వెయ్యినోట్ల రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కొంత వూరట కలగనుంది. రద్దు చేసిన రూ.500 నోట్ల స్థానంలో కొత్త రూ.500 నోట్లు ఇప్పుడిప్పుడే బ్యాంకుల ద్వారా చలామణిలోకి వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు ఖాతాదారులకు రూ.500 నోట్లు జారీ చేశాయి. ఇప్పటి వరకు రూ.2000, రూ.100 నోట్లు మాత్రమే బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. తాజాగా రూ.500 నోట్లు కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రూ.500 నోట్లు తక్కువ మొత్తంలో విడుదల చేయడంతో ఇంకా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు.