తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత!!
December 5, 2016
తమిళనాడు ముఖ్యమంత్రిగా కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జయలలిత సినిమా రంగానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రికే పరిమితమైన జయలలిత సోమవారం కన్నుమూసినట్లు స్థానిక టీవీ ఛానల్ లో వార్తలు రావడంతో అభిమానులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేక అభిమానులు చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్ద విధ్వంసానికి పాల్పడారు. అపోలో ఆసుపత్రితో పాటు చెన్నైలోని అన్ని ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అయితే జయమరణంపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. అప్పట్లో తమిళంలో స్టార్ గా వెలుగొందుతున్న ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించిన జయలలిత… ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ మరణం తరువాత ఆయన వారసురాలిగా ప్రకటించుకున్న జయలలిత …. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. జయలలిత అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు, ఈ పరిణామాలతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
మకుటం లేని మహారాణిగా
రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో జయలలిత నటించారు. 1961 నుంచి1980 వరకు ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. నాట్యంలో కూడా ఆమెది అందెవేసిన. తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొంతకాలం పాటు ఏలారు.
జయ లలిత బాల్యం
జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.
15వ ఏట సినిమా రంగలోకి
కుటుంబ పరిస్థితుల వల్ల తల్లి బలవంతంతో తన 15వ యేట జయలలిత సినిమా రంగములోకి ప్రవేశించారు. జయలలిత తొలి సినిమా ‘చిన్నడ గొంబె’ అనే కన్నడ చిత్రం. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్.