గురూజీ క్రొత్త యాప్
November 7, 2016
తెలుగు సినిమా దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ప్రత్యేక స్థానం. అభిమానులు ‘గురూజీ’ అని ప్రేమగా పిలుచుకునే ఈ మాటల మాంత్రికుడి పంచ్ లు, ప్రాసల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రతి మాటలో గొప్ప భావం ఇమిడి ఉంటుంది. త్రివిక్రమ్ జన్మదినం సందర్భంగా ఏబీసీ డిజిటల్ మీడియా సంస్థ www.trivikramcelluloid.com పేరుతో ఓ వెబ్ సైట్ ను, trivikramsrinivas పేరుతో ఆండ్రాయిడ్ యాప్ ను విడుదల చేసింది. వీటిలో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందుపరచారు. త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన తాజా సమాచారం కావాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.