ఉత్సాహంగా సాగిన వైద్య విద్యార్థుల స్వాగత వేడుక

ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుక శుక్రవారం రాత్రి కోలాహలంగా జరిగింది. భవిష్యత్ వైద్యులు తమ జూనియర్ విద్యార్థులకు అపురూపంగా స్వాగతాన్ని పలికారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేదిక హుషారెత్తింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ చాట్ల నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులందరూ రోగరహిత సమాజానికి పాటుపడాలని సూచించారు. వైద్య కళాశాలలో ర్యాగింగ్ అనే దుష్ట సంప్రదాయాన్ని తరిమికొట్టాలని పిలుపిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవిప్రభు మాట్లాడుతూ వైద్య వృత్తిలో కొనసాగే వారు నిత్య విద్యార్థుల్లా ఉండాలని, ఎప్పటికప్పుడు జీవసాంకేతిక రంగాల్లో నూతన అన్వేషణలు, ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపాల్ హుషారైన పాటలు పాడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని రేకిత్తించారు. మెడికోలు తమ డ్యాన్సులతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, వైద్యులు విఎల్ఎస్ రామన్, భక్తవత్సలం, శశికాంత్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *