సెల్ఫీలే సెల్ఫీలు
November 10, 2016
క్రొత్త నోట్లు మార్కెట్లోకి విడుదలయ్యాయో లేదో బ్యాంకుల నుండి వాటిని పొందిన వారు సెల్ఫీలతో సోషల్ మీడియా ను హోరెత్తిస్త్తున్నారు. నూతన నోట్లు తమకు దక్కిన అపూరూపమైన సంపద లాగా తమ మిత్రులకు తెలియజేసాలా సెల్ఫీలు పోస్టు చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు. కొందరైతే పాత నోట్లకు గుడ్ బై చెప్తూ చివరి సెల్ఫీలు అంటూ పోస్టు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా లో ఈ ట్రెండ్ కొనసాగవచ్చని టెకీలు అంచనా వేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సెల్ఫీ పోస్టు చేయండి మరి.