వారంలో నూతన భవనాల్లోకి విక్రమ సింహపురి యూనివర్సిటీ: వీసీ వీరయ్య

నాగార్జున యూనివర్సిటీ లో గురువారం నాడు జరిగిన విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలకమండలిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి వివరిస్తూ శుక్రవారం వీ.ఎస్.యూ పరిపాలన భవనంలో వైస్-ఛాన్సలర్ ఆచార్య వి.వీరయ్య పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రిని జిల్లాకు రప్పించి యూనివర్సిటీ భవనాలు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారని కనుక మరో వారం రోజుల్లో వర్శిటీ నూతన భావనల్లోకి మారనుందని తెలిపారు. వర్శిటీ పరిపాలనతో పాటు కళాశాల, హాస్టల్ అంతా నూతన భవనాల్లోనే నిర్వహిస్తామన్నారు. పెండింగ్ 3 కోట్ల రూపాయల బిల్లులను కాంట్రాక్టర్ కు మరో రెండు నెలల్లో చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ అన్ని ఎకౌంటు లను ఆడిట్ చేయించేందుకు నిర్ణయించామన్నారు. శాశ్వత మహిళా ఉద్యోగుల సంరక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 వేల రూపాయల చొప్పున జీతాలు పెంచామని, గత ఏప్రిల్ నుండి అది అమల్లోకి వస్తుందని తెలిపారు.  వర్శిటీ లో టీచర్లకు కెరీర్ అడ్వాన్స్డ్ స్కీం క్రింద ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. 17 టీచర్లు ఎటువంటి గ్రాంట్ లేకుండా ప్రాజెక్ట్ లకు దరఖాస్తు చేసారని వారికి ఆర్ట్స్ వారికి 1 లక్ష రూపాయలు, సైన్స్ వారికి 2 లక్షల రూపాయలు స్టార్ట్ అప్ గ్రాంట్ క్రింద యూనివర్సిటీ నిధుల నుండే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న పెండింగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తున్నట్లు తెలియజేసారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ శివశంకర్ పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *