వర్శిటీ రిజిస్ట్రార్ శివశంకర్ వేధిస్తున్నారంటూ అట్రాసిటీ కేసు నమోదు

విక్రమ సింహపురి యూనివర్శిటీ రిజిస్ట్రార్ శివశంకర్ పై కుల దూషణ కేసు నమోదయింది. ఈ మేరకు ఒకటో నెంబర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారు. కాకుపల్లి గ్రామానికి చెందిన ఆములూరి ప్రసాద్ వర్శిటీ లో శాశ్వత డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు వీసీ ల దగ్గర నమ్మకమైన డ్రైవర్ గా పనిచేసిన ప్రసాద్ పై వర్శిటీ లోని కొంత మంది సిబ్బంది రిజిస్ట్రార్ శివశంకర్ కు చెప్పుడు మాటలు చెప్పారు. దీంతో శివశంకర్ డ్రైవర్ ప్రసాద్ విధులను మెస్ సెక్షన్ కు మార్చారు. కాంట్రాక్టు డ్రైవర్లు ఉండి కూడా శాశ్వత ఉద్యోగి అయిన తనకు అధికారిక వాహనాలకు కాకుండా మెస్ వాహనానికి వేయడం ఏమిటని, తనకు ఆ విధులు చేయడం ఇష్టం లేదని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్రహంతో రిజిస్ట్రార్ శివశంకర్ ఇక్కడ తాను చెప్పేదే వేదం అంటూ తాను ఎలా చెప్తే ఆలా నడుచుకోవాల్సిందేనని లేదంటే ఉద్యోగం నుండి సస్పెండ్ చేసేస్తానని నీ స్థాయికి తగినట్లు నువ్వుండని కులం పేరుతో దూషిస్తూ అవమానపరిచారు. దీంతో బాధపడిన ప్రసాద్ ఒకటో నగర పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. సీఐ అబ్దుల్ కరీమ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

   

Add a Comment

Your email address will not be published. Required fields are marked *