మా ఇంటి బీరువాను చూసే షాకయ్యాను మరి సోదరుడు జగన్ మోహన్ రెడ్డి పరిస్థితేంటో అంటున్న సోమిరెడ్డి

500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. “రద్దు నిర్ణయం చూడగానే నేను షాక్  గురయ్యాను. ఇంట్లోకి వెళ్ళి బీరువా తెరచి చూడగా 26 వెయ్యి రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి.  వాటిని ఎలా మార్చాలా అని ఆలోచించాను. నేనే ఇలా ఆందోళన చెందితే ఇక సోదరుడు జగన్ మోహన్ రెడ్డి ఎలా షాకై ఉంటారో? బెంగుళూరు వైట్‌ హైస్‌లో భూగర్బంలో వున్న డబ్బును ఏం చేయాలో తెలియక షాకై ఉంటారు.” అని సోమిరెడ్డి చమత్కరించారు. ఏదేమైనా నల్లధనం కూడబెట్టని అవినీతిపరులు కానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ డబ్బును స్వచ్ఛంగా బ్యాంకుల నందు తగిన ఆధారాలు చూపి మార్పు చేసుకోవచ్చని తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబు ఎప్పటినుండో కోరుతున్న నోట్ల రద్దు ఆచరణలోకి రావడం తమకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తున్నదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *