మన మధ్య లేకపోయినా నెల్లూరు చరిత్రలో నిలిచిన ప్రముఖులు

123Nellore proudly presenting you the conceptual story, Nellore lo “Appatlo Okadundevadu”.
 
నెల్లూరు చరిత్ర గర్భంలో ప్రముఖులుగా, మహామహులుగా మెలిగి నెల్లూరు ప్రాంత భవిష్యత్తుకు పునాదులు ఏర్పర్చిన మహనీయులు ఎందరో ఉన్నారు. తరాలు మారొచ్చు కానీ ముందు తరాల వారు మనకు అందించిన స్ఫూర్తిని, నెల్లూరు ప్రాంతానికి వారు తెచ్చిన గుర్తింపుని మనం మరువగలమా. కాల గర్భంలో కలిసిన అందర్నీ గుర్తుకు తెచ్చుకోవడం ఎంతో కష్టమైన పని. కాని కొందరినైనా ఇప్పటివారికి జ్ఞప్తికి తీసుకురావాలనేది ఈ కథనం ముఖ్య ఉద్దేశం. భౌతికంగా మన మధ్య లేని కొందరు నెల్లూరీయుల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరింతమంది గురించి వివరాలు ఉంటే మా ఈమెయిలు 123nelloreinfo@gmail.com కు పంపగలరు.
 

1. తిక్కన సోమయాజి (Tikkana Somayaji)

తిక్కన జీవిత కాలం 1205 – 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు.కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.

 2. వెంకయ్య స్వామి (Venkayya Swamy)

నెల్లూరు జిల్లాలోని గొలగమూడి లోకల వెంకయ్య స్వామి ఆలయం ప్రసిద్ధ క్షేత్రం. ఈ క్షేత్రం నెల్లూరుకు 10 కిలోమీటర్ల దూరంలో వెంకటాచలము మండలంలో ఉంది. ఈ ఆలయ స్వామి వెంకయ్యను ఆ ప్రాంత ప్రజలు భగవంతునిగా కొలుస్తారు. 

3. పొట్టి శ్రీరాములు (Potti Sriramulu)

ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత: స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

4. పాలూరి శంకరనారాయణ (Paluri Sankara Narayana)

ఆచార్య పాలూరి శంకరనారాయణ భాషావేత్త, నైంఘటికుడు, సంస్కృతాంధ్ర పండితుడు, రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యుడు. ఈయన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారుదాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. సొంతూరు నెల్లూరు., కానీ మద్రాసులో స్థిరపడ్డారు.

5. ఆచార్య ఆత్రేయ (Acharya Atreya)

ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 – సెప్టెంబర్ 13, 1989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు

6. తిక్కవరపు వెంకట రమణారెడ్డి (Tikkavarapu Venkata Ramana Reddy)

తెలుగు సినిమా హస్యనటుల్లో రమణారెడ్డి (అక్టోబర్ 1, 1921 – నవంబరు 11, 1974) (తిక్కవరపు వెంకటరమణారెడ్డి) ప్రముఖుడు. సన్నగా పొడుగ్గా ఉండే రమణారెడ్డి అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు.

7. దువ్వూరి రామిరెడ్డి (Duvvuri Ramireddy)

దువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895 — సెప్టెంబర్ 11, 1947) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని “సింహపురి సిరి”గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు.

8. వై.వి.రావు (Y V Rao)

యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (మే 30, 1903 – ఫిబ్రవరి 14, 1973) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.

9. వెన్నెలకంటి రాఘవయ్య (Vennelaganti Raghavaiah)

వెన్నెలకంటి రాఘవయ్య (జూన్ 4, 1897 – నవంబరు 24, 1981) స్వరాజ్య సంఘం స్థాపకుడు. ప్రజలు ఆయన్ని “నెల్లూరు గాంధీ” అని పిలిచేవారు. ఎరుకలు, యానాదులు, లంబాడీలు, చెంచులు, బుడబుక్కల , ఇతర సంచార, విముక్త ఆదిమ జాతుల్ని సంఘటితంచేసి వారిలో చైతన్యం తెచ్చాడు. 1973లో పద్మభూషణ్ అవార్డు పొందారు.

 10. విద్వాన్ కణ్వశ్రీ (Vidwan Kanwasri) 

కణ్వశ్రీ నాటక రచయిత మరియు సినీ రచయిత. ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం. చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు. ఇతని బాలనాగమ్మ, మాయాబజార్ నాటకాలను నేటికీ సురభి నాటకసమాజం ప్రదర్శిస్తున్నది. ఇతడు మద్రాసులో స్థిరపడిన తరువాత కొన్ని సినిమాలకు మాటలు, పాటలు వ్రాశాడు.

 11. బెజవాడ గోపాల రెడ్డి (Bezawada Gopala Reddy)

స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 – మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్ కు గవర్నరు గాను మరియు రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.

12. పుచ్చలపల్లి సుందరయ్య (Puchalapalli Sundarayya)

పుచ్చలపల్లి సుందరయ్య (1913 – 1985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన ఆయన తన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడు. సహచరులు ఈయనను “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచేవారు.

13. దొడ్ల సుబ్బారెడ్డి (Dodla Subba Reddy)

నెల్లూరు నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి డీకేడబ్ల్యూ కళాశాల, ఇలా అనేక ప్రదేశాల నిర్మాణాల వెనుక దాగున్న పేరు దొడ్ల సుబ్బారెడ్డి. ఆయన దాతృత్వం నెల్లూరు నగరంలో చిరస్మరణీయం. నేటికీ ఆయన గురించి, ఆయన దానాల గురించి ప్రజలు “అప్పట్లో ఒకడుండేవాడు” అని చర్చించుకుంటారు.

14. ఆనం చెంచు సుబ్బారెడ్డి (Anam Chenchu Subbareddy)

ఎ.సి.రెడ్డి గా పేరొందిన ఆనం చెంచుసుబ్బారెడ్డి నెల్లూరు ప్రాంతంలో సుప్రఖ్యాతులైన ప్రజా నాయకులు. స్వాతంత్ర్య సమరయోధులు.

15. ఇంగువ కార్తికేయ శర్మ (Inguva Karthikeya Sharma)

ఇంగువ కార్తికేయశర్మ ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త, శాసన పరిశోధకులు.ఆయన పురాతత్వ శాస్త్రంలోనే కాకుండా కళలు, ఆర్కిటెక్చర్, ప్రాచీన కట్టడాల పరిరక్షణ వంటి అంశాలలో ప్రసిద్ధులు.

16. పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (Dr. Puchalapalli Ramachandrareddy)

పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి నెల్లూరు పట్టణంలో ప్రజావైద్యునిగా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన వ్యక్తి. ప్రముఖ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య తమ్ముడు. నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు, కావలి పట్టణానికి చెందిన విశ్వోదయ కళాశాలల సహ వ్యవస్థాపకుడు. జనబాహుళ్యంలో డాక్టర్ రాం అన్న పేరుతో సుప్రసిద్ధుడు.

17. మాగుంట సుబ్బరామిరెడ్డి (Magunta Subbarami Reddy)

మాగుంట సుబ్బరామిరెడ్డి (నవంబర్ 26, 1947 – డిసెంబర్ 1, 1995) బాలాజీ గ్రూప్ స్థాపకుడు. మాగుంట సుబ్బరామిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు.

18. ఎం.ఎస్.రెడ్డి (M S Reddy)

మల్లెమాల (ఆగష్టు 15, 1924 – డిసెంబర్ 11, 2011) ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి “సహజ కవి”గా ప్రశంసలందుకున్నారు.

19. నేదురుమల్లి జనార్ధన రెడ్డి (Nedurumalli Janardhana Reddy)

నేదురుమల్లి జనార్థన్ రెడ్డి  1935, ఫిబ్రవరి 20న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వాకాడులో జన్మించాడు. భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలలో ఒకడైన జనార్థన్ రెడ్డి 1992-94 కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

20. మల్లి మస్తాన్ బాబు (Malli Masthan Babu)

మల్లి మస్తాన్‌బాబు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. పర్వతారోహణలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్ సాధించిన సాహాసికుడు. మస్తాన్ బాబు 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులలోకి ఎక్కాడు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు బిడ్డడు మస్తాన్‌బాబు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *