ప్రభుత్వ కళాశాలలో 150 మెడికల్ సీట్లు రద్దు

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏ ఏటికాఏడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) చేతిలో అభాసుపాలవుతున్నది. గతంలో సౌకర్యాలు, సదుపాయాలు సరిగా లేవని ప్రవేశాలకు నిరాకరించిగా విషయం రాజకీయంగా మారి ఆపసోపాలు పడి ఈ సంవత్సరానికి అడ్మిషన్లు జరిగేలాగా అనుమతులు తెచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా ఎం.సి.ఐ. తనిఖీలు చేపట్టింది. బోధనాసిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, అనుబంధ ఆసుపత్రుల్లో సరైన ప్రమాణాలు లేవని నిర్ధారించింది. దీంతో ఇక్కడ ఉన్న 150 సీట్లను రద్దు చేస్తూ వచ్చే ఏడాదికి ప్రవేశాలు జరిపేందుకు వీలు లేదని తేల్చిచెప్పింది. ఎం.సి.ఐ వారు నిర్ధారించిన ప్రమాణాలను ఫిబ్రవరి నాటికి ఏర్పర్చి మళ్ళీ ఎం.సి.ఐ బృందాన్ని ఆహ్వానించి ప్రవేశాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి తెలియజేస్తున్నారు. సదుపాయాలను సరిచేయకుంటే వచ్చే ఏడాది ప్రవేశాల కొరకు మన నాయకులు మరెన్ని రాజకీయాలు నడపాలో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయినా దశాబ్దాల కలగా ఏర్పడిన మెడికల్ కాలేజీ విషయంలో ఇలా జరుగుతుండడం జిల్లాలో అనేక మందిని భాదిస్తున్నది. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *