పెళ్లి కూతురి ముస్తాబు నుండి అంతా తానై చూసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

గాలి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం కోసం సంగీత్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డాన్స్ వేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇవే రకుల్ డాన్స్ వీడియోలు అంటూ కొన్ని సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఆమె ఎంత డబ్బు తీసుకుంది తెలపాలంటూ ఐటీ శాఖ తాఖీదులు ఇచ్చిందని మరో వార్త వచ్చినా అలాంటి నోటీసులు ఏమీ రాలేదంటూ రకుల్ కొట్టిపారేసింది. అయినా ఆడిటింగ్ అప్పుడు చూపాల్సిన లెక్కలను ఇప్పుడే ఎవరు అడుగుతారు చెప్పండి. ఇదిలావుండగా తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే రకుల్ ప్రీత్ గాలి పెళ్ళిలో సంగీత్ లోని డాన్స్ కి మాత్రమే పరిమితం అయిపోలేదు. పెళ్లి కూతురి ముస్తాబు నుండి పెళ్లి పూర్తయ్యే వరకు అంతా తానై దగ్గరుండి నడిపించింది రకుల్ ప్రీత్. గాలి పెళ్ళిలో అతిథులను ముఖ్యంగా పెళ్లి కుమార్తె స్నేహితులను సమన్వయం చేసే బాధ్యతలను రకుల్ దగ్గరుండి చూసిందట. పెళ్లి పూర్తయ్యే నాటికి బ్రాహ్మణి తనకో మంచి స్నేహితురాలు రకుల్ రూపంలో దొరికిందని అందరికీ చెప్పిందట. మరి గాలి జనార్దన్ రెడ్డి లాంటి ధనికుల ఇంట్లో పెళ్లంటే ఆషామాషీ వ్యవహారం కాదు గా అంటున్నారు పలువురు పెళ్ళికి విచ్చేసిన అతిథులు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *