పెద్దాసుపత్రి అక్రమాల పై కదం తొక్కిన కలెక్టర్ ముత్యాలరాజుకి ధన్యవాదాలు

నెల్లూరు పెద్దాసుపత్రిలో జరుగుతున్న మెడికల్ మాఫియా ను ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చి నాయకులు కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి తీసుకెళ్లడం తెలిసిందే. స్పందించిన కలెక్టర్ ప్రత్యేక నిఘా ఉంచి ఆరుగురు డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టిస్ చేస్తూ పట్టుబడగా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దాసుపత్రిని 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కానీ నేడు పరిస్థితిని చూస్తుంటే కొంతమంది డాక్టర్లు లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూ ఉదయం వచ్చి సంతకాలు పెట్టేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేయడం దుర్మార్గం అని అన్నారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులను ఆరోగ్య శ్రీ కార్డు తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళమని చెప్పడం, డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసిన నారాయణ మెడికల్ కళాశాలలో రోగులను నింపేందుకు ఇక్కడి డాక్టర్లు పి.ఆర్.వోలుగా పనిచేయడం సిగ్గుచేటన్నారు. కొంతమంది వైద్యులు నిజాయితీతో పనిచేస్తున్నారు కనుకే ఇప్పటికీ పెద్దాసుపత్రి మనుగడలో ఉందని కానీ కొంతమంది వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని దుయ్యబట్టారు.
ప్రజల పక్షాన నిలబడి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకున్న కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. పెద్దాసుపత్రిలో స్వానింగ్ మిషన్లు, ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ యూనిట్లు నిరుపయోగంగా ఉన్నాయని మరమత్తులు చేయించి వాడుకలోకి తీసుకురావాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ చిరంజీవి యువత ఉపాధ్యక్షులు పావుజెన్ని శేఖర్ రెడ్డి, నాయకులు సూర్యనారాయణ, గణేష్, కస్తూరయ్య, బాలా, మోషా, మురళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *