పవన్ కళ్యాణ్ వద్దకు నెల్లూరు యూనివర్సిటీ విద్యార్ధుల పాదయాత్ర

విక్రమ సింహపురి యూనివర్సిటీలో అనేకనాళ్ళుగా జరుగుతున్న అక్రమాల పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కనీస స్థాయి దర్యాప్తులు కూడా జరిపించి నిజానిజాల నిర్ధారణ జరపట్లేదని, అవినీతికి పాల్పడుతున్న రిజిస్ట్రార్ శివశంకర్ ఎధేచ్చగా అక్రమాలు జరుపుకునేందుకు సహకరిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎవరని ప్రశ్నిస్తూ, అసలు ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నదని తెల్పుతూ, రాష్ట్ర పభుత్వం విద్యార్ధుల విశ్వాసాన్ని కోల్పోయిందని తెలియజేస్తూ ఇక పవన్ కళ్యాణే తమకు దిక్కు అని తెలియజేస్తూ అక్రమాలు నశించేలా పవన్ కళ్యాణ్ తోడ్పడాలని కోరుతూ నెల్లూరు నుండి పాదయాత్రగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి సమస్యలు తెల్పనున్నట్లు విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధులు నెల్లూరు నగరం లో పోస్టర్లు వేశారు. ఫిబ్రవరి 22 న నెల్లూరు వీఆర్సీ నుండి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *