నెల్లూరుకి వచ్చి నారాయణను పరామర్శించనున్న ముఖ్యమంత్రి

మంత్రి నారాయణ ఇంట్లో పెను విషాదం నెలకొన్న సమయంలో విదేశీ పర్యటనలో ఉండి నిషిత్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన పూర్తైన నేపథ్యంలో నెల్లూరు రానున్నారు.
శనివారం ఉదయం 11.30 కి ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడ నుండి నారాయణ మెడికల్ కళాశాలకు చేరుకొని నారాయణ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. స్వతహాగా తనకు మిత్రుడైన నారాయణ కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగడం తనను కలచివేస్తున్నట్లు ముఖ్యమంత్రి బాధను వ్యక్తపరచారు.  నారాయణ కుటుంబాన్ని పరామర్శించి విజయవాడ సచివాలయం లో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి బయల్దేరి వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.    

Add a Comment

Your email address will not be published. Required fields are marked *