తిరుమల దేవస్థానంలో స్కౌట్స్ మరియు గైడ్స్ గా సేవలందించే అవకాశం
December 3, 2016
తిరుమల శ్రీవారి దేవస్థానంలో స్కౌట్స్ మరియు గైడ్స్ గా సేవలందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 18 నుండి 40 వరకు వయసు కల్గిన పురుషులు, మహిళలు అర్హులేనని నెల్లూరు నుండి పాల్గొనదలచిన వారు ఈ నెల 9, 10, 11 తేదీలలో స్థానిక స్టోన్ హౌస్ పేట లోని ఆర్ఎస్ఆర్ హై స్కూల్ నందు జరుగు ట్రైనింగ్ క్యాంపు నకు హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు. ట్రైనింగ్ క్యాంపునకు హాజరు కాగోరు వారు తప్పని సరిగా యూనిఫారం కలిగి ఉండాలని తెలియజేసారు. మరిన్ని వివరాలకు మరియు దరఖాస్తులకు 9700072712 ఫోన్ నెంబర్ నందు సంప్రదించవచ్చు.