చైనాకు గూగుల్ భారీ షాక్…. 2500 ఛానెళ్ల తొలగింపు…?

 గత కొన్ని నెలల నుంచి చైనా పరిస్థితి ఏం బాగోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలు చైనాపై తీవ్రస్థాయిలో వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. భారత్ ఇప్పటికే భారీగా చైనా యాప్ లను నిషేధించింది. యాప్ ల నిషేధం వల్ల చైనాకు ఆర్థికంగా నష్టం కలుగుతోంది. తాజాగా చైనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. చైనాతో ముడి పడి ఉన్న 2500 యూట్యూబ్ ఛానెళ్లను తొలగించింది.

యూట్యూబ్ లో వివాదాస్పద కంటెంట్ ను పోస్ట్ చేస్తూ ఉండటం వల్లే ఆ ఛానెళ్లను తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఛానెళ్ల తొలగింపు గురించి స్పందించాల్సి ఉంది. ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానెళ్లను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది. ఇప్పటికే చైనాకు భారీ షాకులు ఇవ్వగా తాజాగా ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. వివిధ దేశాలు చైనాకు వరుస షాకులు ఇస్తుండటంతో డ్రాగన్ కు ఆర్థికంగా నష్టం కలుగుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *