గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల – మొత్తం 982 పోస్టులు

నిరుద్యోగుల ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు గ్రూప్‌-2 సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ మంగళవారం రాత్రి విడుదలైంది. మొత్తం 982 పోస్టులను ఏపీపీఎస్సీ నోటిఫై చేసింది. ఇందులో 442 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 540 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. ఠీఠీఠీ.ఞటఛి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్లో గ్రూప్‌-2 సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. మొత్తం పోస్టులలో 750 ప్రభుత్వం ప్రకటించినవి కాగా, 232 క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలు. రోస్టర్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు అనుగుణంగా జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా 12 డిపార్ట్‌మెంట్లలోని 34 కేటగిరీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. గ్రూప్‌-2 సర్వీసెస్‌ నోటిఫికేషన్‌కు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 11 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. డిసెంబరు 10తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. ఏదైనా డిగ్రీ ఉన్న వారు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 42 సంవత్సరాల వయస్సు మించని వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్ర్కీనింగ్‌ టెస్ట్‌ను ఫిబ్రవరి 26న నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైపు (ఓఎంఆర్‌ షీట్లు)లో జరుగుతుంది. ఈ పరీక్ష ఒకే పేపర్‌ లో 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ పరీక్ష మే 20-21 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్‌ టైప్‌(కంప్యూటర్‌ బేస్డ్‌)లో నిర్వహిస్తారు. మూడు పేపర్లలో పరీక్ష జరుగుతుంది. గతంలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండేవి కానీ… ఈ సారి ఇంటర్వ్యూలు ఉండవు. కేవలం మెయిన్‌ పరీక్ష మార్కుల మెరిట్‌ ప్రాతిపదికగా, రోస్టర్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు లోబడి సెలెక్షన్స్‌ జరుగుతాయి.

ఏ పోస్టులు ఎన్ని …

  1. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు (442)
  2. మున్సిపల్‌ కమిషనర్లు(గ్రేడ్‌-3) – 12
  3. ఏసీటీఓ – 96
  4. సబ్‌ రిజిసా్ట్రర్‌ (గ్రేడ్‌-2) – 27
  5. డిప్యూటీ తహసిల్దార్‌ – 253
  6. అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌- 8
  7. అసిస్టెంట్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌- 23
  8. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌- 8
  9. ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ -15
  10. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు (540)
  11. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (జీఏడీ) – 67
  12. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(ఫైనాన్స్‌)- 16
  13. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(లా) – 18
  14. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(లెజిస్లేచర్‌) – 23
  15. సీనియర్‌ ఆడిటర్‌ -45
  16. సీనియర్‌ అకౌంటెంట్‌ – 82
  17. సీనియర్‌ అకౌంటెంట్‌(హెచ్‌వోడీ)- 158
  18. జూనియర్‌ అకౌంటెంట్‌ – 39
  19. జూనియర్‌ అసిస్టెంట్‌(గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌)-10
  20. జూనియర్‌ అసిస్టెంట్‌(లేబర్‌)-10
  21. జూనియర్‌ అసిస్టెంట్‌(పీహెచ్‌ అండ్‌ ఎంఈ)-3
  22. జూనియర్‌ అసిస్టెంట్‌(ట్రాన్స్‌పోర్ట్‌) -6
  23. జూనియర్‌ అసిస్టెంట్‌(ప్రిజన్స్‌)-3
  24. జూనియర్‌ అసిస్టెంట్‌(ఉమెన్‌ డెవల్‌పమెంట్‌)-1
  25. జూనియర్‌ అసిస్టెంట్‌ (డ్రగ్స్‌)-2
  26. జూనియర్‌ అసిస్టెంట్‌ (అగ్రికల్చర్‌) -10
  27. జూనియర్‌ అసిస్టెంట్‌ (ల్యాండ్‌ అడ్మినిసే్ట్రషన్‌)-2
  28. జూనియర్‌ అసిస్టెంట్‌(ఎక్సైజ్‌)-4
  29. జూనియర్‌ అసిస్టెంట్‌ (షుగర్‌ కేన్‌) – 1
  30. జూనియర్‌ అసిస్టెంట్‌ (రోడ్లు-భవనాలు) – 14
  31. జూనియర్‌ అసిస్టెంట్‌ (సర్వే) – 4
  32. జూనియర్‌ అసిస్టెంట్‌ (సివిల్‌ సప్లయిస్‌) – 7
  33. జూనియర్‌ అసిస్టెంట్‌(బీసీ వెల్ఫేర్‌) – 3
  34. జూనియర్‌ అసిస్టెంట్‌ (ఏసీబీ) – 1
  35. సీనియర్‌ అకౌంటెంట్‌(ఇన్సూరెన్స్‌)-1
  36. సీనియర్‌ అకౌంటెంట్‌ (ఇన్సూరెన్స్‌ ఏపీ జీ.ఎల్‌.ఐ)-10

Add a Comment

Your email address will not be published. Required fields are marked *