గుట్కాలతో నిర్వీర్యం అవుతున్న యువతరం ఆరోగ్యం

నిషేదిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించి గుట్కాలు ప్రధానమైనవి. ప్రజా ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ఈ గుట్కాల వ్యాపారం నెల్లూరు నగరంలో ప్రమాదకర స్థితిలో కొనసాగుతున్నది. ముఖ్యంగా 19 నుండి 25 సంవత్సరాల వయసున్న యువత దీని బారిన పడి తమ ఆరోగ్యాలను గుల్ల చేసుకుంటున్నారు. కొందరు రోగాలు ముదిరి తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. 
సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ ఉత్పత్తులను అమ్మడం నేరం. కానీ కొందరు వ్యాపారాలు అక్రమంగా గుట్కాలను నిల్వ చేసుకుని రహస్య ప్రదేశాల్లో ఉంచుకుని కస్టమర్లకు అందిస్తున్నారు. 
ఈ నిషేదిత ఉత్పత్తులు ప్రతివారం చెన్నై నగరం నుండి రహస్యంగా రాత్రి పూట లారీల్లో నెల్లూరుకు దిగుమతి అవుతున్నట్లు అనధికార సమాచారం. ఇలా ప్రతి నెల మూడు నాలుగు గుట్కా కంపెనీలకు సంబంధించి 10 నుండి 12 లారీల లోడ్ గుట్కా నెల్లూరుకు దిగుమతి అవుతున్నట్లు సమాచారం. దీని ద్వారా నెల్లూరులో సంవత్సరానికి  సుమారు 25 కోట్ల రూపాయల మేరకు అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా.
చిన్న చిన్న పాన్ షాపుల్లో రహస్యంగా ఈ గుట్కా నిల్వలను ఉంచుకుని డిమాండ్ ను బట్టి ఒక్కో ప్యాకెట్ ను రూ.20/- నుండి రూ.50/- వరకు విక్రయిస్తున్నారు. బాగా తెలిసిన కస్టమర్లకే కొంతమంది విక్రయాలు జరుపుతున్నారు. నెల్లూరు మార్గంలో వెళ్లే రైళ్లలో సైతం పలువురు ఈ అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు.
వక్క, పొగాకులతో పాటు కొన్ని నిషేదిత పదార్థాలు కల్గిన ఈ గుట్కాలు నమలడం మూలానా స్ట్రెస్ నుండి తాత్కాలిక విముక్తితో పాటు మత్తు కలుగుతుంది. దీంతో వీటికి అలవాటు పడిన అనేక మంది వీటికి బానిసలు అయిపోతున్నారు. బాగా నిరుపేదలు, నిరక్ష్యరాసులు అయిన పలువురికి దీని వల్ల కలిగే అనారోగ్య సమస్యలు గురించి సరైన అవగాహన ఏర్పడటం లేదు.
వీటి అమ్మకాల పై పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు రైడ్ లు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది.
“ద హిందూ” ఆంగ్ల దిన పత్రిక నుండి వార్తా సేకరణ

Add a Comment

Your email address will not be published. Required fields are marked *