ఎవరా నాయకుడు అని చర్చించుకుంటున్న నెల్లూరు జనం

500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనం ఉన్న అనేక మంది వివిధ మార్గాల్లో తెల్లధనంగా మార్పు చేసుకొనే ఎర్పాట్లు చేస్తున్నారు. ఇందులో మొదటిది బంగారు కొనుగోలు. ఇప్పుడు తెలియవస్తున్న విషయం ఏమిటంటే నెల్లూరు నగరంలోని మినీబైపాస్ లో గల ఓ ప్రముఖ నగల దుకాణంలో జిల్లాకు చెందిన ఓ ముఖ్య రాజకీయ నేత 5 కోట్ల రూపాయల మేర బంగారాన్ని కొనుగోలు చేశారట! ఈ విషయాన్ని ఓ ప్రముఖ దినపత్రిక బయటపెట్టింది. దీపావళి టపాసుల మాదిరి సంచుల్లో అది ఏ బంగారం, డిజైన్ అనేది కూడా కొనుగోలు చేశారట! తొలుత తన బినామీలతో 3.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి తర్వాత బంగారు కొనుగోలుకు కూడా పాన్ నెంబర్ తప్పనిసరి అని వార్తలు వస్తున్న సమయంలో మరో 1.5 కోట్ల రూపాయలకు నగలు కొనుగోలు చేశారట! ఇంత భారీ మొత్తంలో ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని నగల దుకాణం వారు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రజలు ఆ నాయకుడు ఎవరై ఉంటారా అని ఎవరికి తోచిన రీతిలో వారు చర్చించుకుంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *