ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన నెల్లూరు రన్

నెల్లూరు రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ‘నెల్లూరు రన్’ చాలా ఉత్సాహంగా జరిగింది. పెద్ద సంఖ్యలో యువతీయువకులతో పాటు పిల్లలు, పెద్దలు విశేషంగా పాల్గొన్నారు. కస్తూరిదేవి గార్డెన్స్ లో ఉదయం 6 గంటలకే పరుగులో పాల్గొంటున్న యువత హుషారైన మ్యూజిక్ ఉండడంతో కేరింతలతో వామప్ అయ్యారు. అనంతరం 10కె రన్, 5కె రన్ ప్రారంభం అయ్యాయి. ఈ ఈవెంట్లను నగర మేయర్ అబ్దుల్ అజీజ్, వీపీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 10కె రన్ పోటీలో పాల్గొన్న ప్రజలు కస్తూరి దేవి గార్డెన్ నుండి అయ్యప్ప గుడి సర్కిల్ మీదుగా తిరిగి గార్డెన్ కు చేరుకున్నారు. 5కె రన్ వారు నిప్పో సెంటర్ మీదుగా గార్డెన్ కు తిరిగి చేరుకున్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం కోసం, అవగాహన కోసం ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తూ ఉండాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం పోర్ట్ పీఆర్వో వేణుగోపాల్, నగర డీఎస్పీ వెంకటరాముడు, అపోలో వైద్యశాల ప్రతినిథి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి  10 వేలు, 7 వేలు, 5 వేల రూపాయల నగదు బహుమతులు అందజేశారు. 

10కె రన్ (పురుషుల విభాగం)

ప్రథమ స్థానం – మురుగన్ 
ద్వితీయ స్థానం – యు.రమేష్ 
తృతీయ స్థానం – పి .వంశీకృష్ణ 

10కె రన్ (మహిళా విభాగం)

ప్రథమ స్థానం – సుప్రియ 
ద్వితీయ స్థానం – షలీమ్ ఏంజెల్
తృతీయ స్థానం – కోటేశ్వరమ్మ 

5కె రన్ (పురుషుల విభాగం)

ప్రథమ స్థానం – వి.సాయి 
ద్వితీయ స్థానం – నాగేంద్ర విజయ్ 
తృతీయ స్థానం – జి.అజిత్ 

5కె రన్ (మహిళా విభాగం)

ప్రథమ స్థానం – కె.పార్వతి 

ద్వితీయ స్థానం – ఎ.చందన
తృతీయ స్థానం – అంకాళి

Photos Courtesy: Andhra Jyothy, Deccan Chronicle and Facebook

Add a Comment

Your email address will not be published. Required fields are marked *