ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే మన నెల్లూరు జిల్లా ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి

మన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో వైశాల్యంలో 6వ స్థానంలో ఉన్న మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 29,66,082 (సుమారు 30 లక్షలు. ఈ అయిదు సంవత్సరాలలో మరో 2 నుండి 3 లక్షలు పెరిగి ఉండవచ్చు).   ఇటువంటి మన జిల్లాకు నేడు ప్రత్యేక హోదా వచ్చినట్లయితే నెల్లూరు మరో జర్మనీ అవుతుంది. మన జిల్లాలో ఉన్న నదులు (పెన్నా, స్వర్ణముఖి) మొత్తం 46 మండలాలలో 20 మండలాలను సస్యశ్యామలం చేస్తుండగా, బీడు బంజరు భూములు ఎక్కువగా  ఉన్న 26 మండలాలను 7 ప్రత్యేక సెజ్ లు ఆర్థికంగా జిల్లాను గర్జించేలా చేస్తాయి కానీ నేడు నదులు నీళ్ళు లేక ఎండి పోయి పంట పొలాలు, కంపెనీలు లేక సెజ్ లు వెలవెల పోతున్నాయి.

నెల్లూరు నుంచి అంతర్జాతీయ రవాణాకు స్వర్గధామం అయిన కృష్ణపట్నం, త్వరలో రానున్న దుగరాజపట్నం పోర్టులు, విభజన బిల్లు లోని కోస్టల్ కారిడార్, హైవే కారిడార్ లకు ఈ ప్రత్యేక హోదా ఒక సంజీవని. అవును మన నెల్లూరు వనరులకు 100% ఎక్సైజ్ టాక్స్ మినహాయింపు వస్తే నేడు వెలవెలబోతున్న సెజ్ లు కంపెనీలతో నిండిపొతాయి.

తాపీ మేస్త్రీలుగా, కూలీలుగా, హోటల్లలో సర్వర్లుగా, బార్లలో వెయిటర్లుగా మరియు ఉన్నత చదువులు చదివినా చాలీ చాలని జీతాలతో మన పొరుగు రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న మన సోదరులు మన ఊరికి వచ్చి గర్వంగా బ్రతుకుతారు తద్వారా ఆర్థిక అసమానతలు తొలగి మన జిల్లా మన రాష్ట్రం లోనే కాదు మన దేశం లోనే అగ్రగామి అవుతుంది.

ప్రత్యేక హోదా వలన మనకు కలిగే ఉపయోగాలు

  • ప్రతి గ్రామంలో మెరుగైన విద్య, ఆరోగ్య, రవాణా వసతులు మెరుగు అవుతాయి.
  • కేంద్రం ఇచ్చే 70% కాకుండా 30 % ప్రత్యేక సహాయం వలన నెల్లూరు కి రెవెన్యూ లోటు పోయి మిగులు ఏర్పడుతుంది.
  • నిధులు సమీకరించాల్సిన సమయంలో 90% గ్రాంటుగా 10% లోనుగా లభిస్తుంది (సాధారణ రాష్ట్రాలకు 30% గ్రాంటు 70% లోను < లోను అనగా అప్పు > )
  • ప్రత్యేకహోదా వలన నేడు ఖాళీగా ఉన్న 7  సెజ్ లలో సుమరు 3000 ( భారీ, మధ్య, చిన్న తరహా) పరిశ్రమల స్థాపన జరుగుతుంది.
  • రాబోయే కోస్టల్ కారిడార్, హైవే కారిడార్ ల ద్వారా మరో 1000 కంపెనీల స్థాపనకు మార్గం సుగమం అవుతుంది.
  • ప్రత్యక్షంగా 2,00,000 మంది పరోక్షంగా మరో 1,00,000  మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి ( ప్రస్తుతం ఉన్న సెజ్ ల లోని కంపెనీలలో 22,000 మంది ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా).

ప్రత్యేక హోదా సాధించినట్లయితే నెల్లూరు దేశం గర్వపడే జిల్లా అవుతుంది.

కనుక ఓ నెల్లూరీయుడా, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దాం. ప్రగతి పథంలోకి దూసుకుపోదాం.

== జై ఆంధ్రా – నా ఆంధ్రా ==  
== మన నెల్లూరు – మన భవిష్యత్తు ==

Add a Comment

Your email address will not be published. Required fields are marked *