Ys Jagan: విశాఖలో ప్రముఖుల నివాసాల్లో వివాహ సంబరాలు.. హాజరు కానున్న సీఎం జగన్​

Ys Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి  ప్రస్తుతం విశాఖ పర్యటనలో బిజీగా ఉన్నారు. అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు ఆత్మీయులకు సంబంధించిన వివాహాలకు హాజరవుతూ నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.  ఈక్రమంలోనే వైసీపీ నేత, విజయనగరం జి్లా డీసీసీబీ ఛైర్మెన్​ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహంతో పాటు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి పెళ్లికి హాజరుకానున్నారు.

ys-jagan-may-attend-at-venkayyanayudu-grand-daughter-marriage-reception

విశాఖ వేదికగా అగరంగా వైభవంగా వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్​ జరగనుంది. ఈ కార్యక్రమానికి జగన్​ హాజరుకానున్నారు. ఈ వేడుకకు జగన్​తో పాటు అనేకమంది రాజకీయ ప్రముఖులు రానున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర మంత్రులతో సహా పలు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై విశాఖలో రెండురోజుల పాటు ఉండనున్నారు. ఆమె కూడా వెంకయ్యనాయుడు మనవరాలి రిసెఫ్షన్​కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీకి చెందిన ప్రముఖులతో పాటు… ఇతర పార్టీల వారు కూడా పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు తరలి వస్తున్నట్లు సమాచారం. దీంతో విశాఖ మొత్తం రాజకీయ సందడి నెలకొననున్నట్లు కనిపిస్తోంది.మరోవైపు ఏపీ గవర్నర్​ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని పరామర్శించారు జగన్​. వీలైనంత విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. కాసేపు ఇద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు ఏపీలో ఇటీవలే సంభవించిన వరదలపైనా ముచ్చటించారు. ఈ వరదల కారణంగా పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. చాలా కుటుంబాలు తలదాచుకోడానికి ఇళ్లులేక సతమతమైపోతున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *