ఆటో చక్రాలు గాల్లోకి లేపి ఫీట్లు చేసిన కుర్రాళ్లు..!

కొంతమంది సరదా కోసం చేసే వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనిలో మాత్రం భిన్నంగా వేరే వాళ్లు తీసిన వీడియో వైరల్​ గా మారింది. కానీ వారు చేసిన విన్యాసాలు మామూలుగా లేవు. అది ఆటో అని కూడా చూడకుండా రోడ్లపైన ఇష్టం వచ్చినట్లు పరుగులు పెట్టించారు. కేవలం ఇలా చేసింది ఓకే ఆటోలో ఉన్న వారే అనుకుంటే పొరపాటే. మూడు ఆటోలు వేసుకుని రోడ్డు మీదకు వచ్చిన వారు.. ప్రమాదకర రీతిలో ఫీట్లు చేశారు. రోడ్డును అంతా ఆక్రమించేసినట్లుగా మూడు ఆటోలు మిగతా రోడ్డును పోయే వారికి ఇబ్బంది కలిగించాయి. ఇది జరిగింది ఎక్కడో అనుకుంటే పొరపాటే. మన హైదరాబాద్​లో.

Youth perform dangerous vehicle stunt on road
Youth perform dangerous vehicle stunt on road

అసలు ఏం జరిగింది అంటే.. హైదరాబాద్​ లోని చంద్రాయాణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే కొందరు యువకులు రోడ్డలపై విచ్చలవిడిగా ప్రవర్తించారు. మూడు ఆటోలను వేసుకుని రోడ్డు పైన చక్కర్లు కొట్టారు. అంతేగాక ఆటోకు ఉండే మూడు చక్రాలలో రెండు చక్రాలను మాత్రమే రోడ్డు పైన ఉంచి… మిగతా చక్రాన్ని గాల్లో లేపారు. ఒక ఆటోలో వాళ్లు మాత్రమే అలా చేశారు అనుకుంటే తప్పే అవుతుంది. మొత్తం మూడు ఆటోలలో వచ్చిన వీరు ఒకరిని చూసి ఒకరు ఇలా చేశారు.

వీరు చేసిన కోతి పనులను చూసిన కొంతమంది స్థానికులు వీడియోలు తీశారు. వాటిని సామాజిక మాధ్యామాల్లో ఉంచగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. అయితే వీరు నడిపిన ఆటోలు సొంతవి కాదంట. అద్దె ఆటోలు తీసుకుని ఫ్రెండ్స్​తో ఇలా ఎంజాయ్ చేస్తున్నారని తరువాత తెలిసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *