వి.ఎస్.యూ పరిశోధక విద్యార్థిని పాటూరు కీర్తికి డాక్టరేట్ ప్రధానం
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరుకి చెందిన పాటూరు జయప్రకాష్ మరయు రమాదేవి దంపతుల కుమార్తె పాటూరు కీర్తికి విక్రమ సింహపురి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. 2016 లో వర్శిటీలోని టూరిజం విభాగంలో పరిశోధక విద్యార్ధినిగా చేరిన కీర్తి టూరిజం విభాగాధిపతి డాక్టర్ మైలా త్యాగరాజు పర్యవేక్షణలో “ఏ స్టడీ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద న్యూలి ఫార్ముడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్” (నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక వనరుల అభివృద్ధి) అనే అంశం పై ఈమె పరిశోధన చేసారు. పరిశోధనకు సంబంధించి అసమాన పురోగతి చూపినందుకు ఐదేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫెలోషిప్ ని సైతం పొందారు.
తాను పూర్త్తి చేసిన పరిశోధనా గ్రంథాన్ని సమర్పించినందుకు గాను విక్రమ సింహపురి యూనివర్శిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను వర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి విడుదల చేసారు. డాక్టరేట్ పొందిన కీర్తిని వర్శిటీ వైస్-ఛాన్సలర్ ఆచార్య జి.ఎం.సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) అభినందించారు.
ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి డాక్టరేట్ పొందిన సందర్భంగా యూనివర్సిటీ అధికారులు, విభాగాధిపతి, అధ్యాపకులు, సహ-పరిశోధన విద్యార్థులు, స్నేహితులు ఈ కీర్తిని అభినందించారు .
Congratulations Keerthi