బయటకు నేనూ వస్తానంటున్న కాళ్లు లేని కుక్క..!

పెంపుడు జంతువులు అంటే మనలో చాలా మంది ఎంతో ఇష్టం. బాగా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాము. వాటికి కావాల్సిన ప్రతీదీ మనమే దగ్గర ఉండి చూసుకుంటాము. వాటికి ముద్దు పేర్లు పెట్టి ఎంచక్కా పిలుచుకుంటాం. వాటికి చిన్న నొప్పి అనిపించా సరే మనం చాలా ఫీల్ అవుతాం. అందుకే వాటిని దగ్గర ఉండి చూసుకుంటాం.అయితే ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒక యజమాని తన పెంపుడు కుక్కుకు ఇచ్చిన విలువ చూసి సోషల్ మీడియో ఫిదా అయ్యింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందామా…

VIRAL VIDEO OF PUPPY FIGHTING WITH HIS OWNER IN COIMBATORE
VIRAL VIDEO OF PUPPY FIGHTING WITH HIS OWNER IN COIMBATORE

తమిళనాడులోని ఓ కుక్కకు కాళ్లు లేవు. ఆ శునకం తన యజమాని బయటకు పోతున్న ప్రతీ సారి తనని కూడా తీసుకెళ్లాలని మారాం చేస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది సరిగ్గా తమిళనాడులోని కోయంబత్తూర్‌కి చెందిన కాశీ అనే వ్యక్తి ఇంట్లో జరిగింది. కాశీ ఇంట్లో ఉండే ఆ శునకం పేరు వీరా. దానిని అతను దత్తత తీసుకున్నారు.

అయితే ఈ శునకానికి కాళ్లు లేకపోవడంతో ఎప్పుడు అడిగినా గానీ… బయటకు తీసుకెళ్లలేకపోయో వారు. బయటకు వెళ్తుంటే తాను కూడా వస్తానంటూ ఆ కుక్కు పెద్దగా తన అసంతృప్తిని వ్యక్తం చేసేది. అయితే దానిని అర్థం చేసుకున్న యజమాని కాశీ దానికి ఓ వీల్ చైర్ ను చేయించాడు. అంతే కాకుండా దానిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా శిక్షణ ఈ పనిని ప్రధాని మోదీ కూడా చూసి ప్రశంసించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *