వేప ఆకుల ఉపయోగాలు..!

వేపచెట్టు కింద కాచే నీడ చాలా చల్లగా ఉంటుంది. వేప విత్తనాలు ఎరువుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ వేపాకును నాలుకు మీద పెట్టుకుంటే భరించలేని చేదు. కానీ ఆ వేపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలీదు. వేపాకును ఆటలమ్మ(అమ్మోరు) పోసినప్పుడు పక్కమీద వేసుకుని పడుకుంటే తగ్గిపోతుందని ఇప్పటికీ పల్లెటూర్లలో వినియోగిస్తారు. వేపాకుతో కషాయం చేసుకుని తాగితే కడుపులో ఉన్న మలినం అంతా పోతుందని చాలా మంది తాగుతారు. కానీ వీటికే కాకుండా అందాన్ని పెంచడంలోనూ వేపాకు సహయా పడుతుంది. అదెలా అనుకుంటున్నారా..అయితే చూడండి.

ముఖం మీద ఉన్న మొటిమలను వేపనీళ్లతో నివారించవచ్చు. అరలీటరు మోయన నీళ్లు తీసుకుని, అందులో కాసిన్ని వేపాకులు కలిపి కాగబెట్టాలి. నీళ్ల పచ్చరంగులోకి వచ్చే వరకు మరిగించాలి. ఈ నీళ్లను చల్లార్చి వడపోయాలి. దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకోవడం వల్ల పాడవకుండా ఉంటుంది. ఇక రోజూ దూదిని ఈ నీటిలో ముంచి ముఖానికి రాసుకోవాలి. కాసేపు ఆరబెట్టుకుని కడగాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత మొటిమలు, మచ్చులు పోతాయి. కళ్ల చుట్టూ ఉన్న నలుపును కూడా మాయం చేస్తుంది.

వేపాకు పొడిని కొంచం నీళ్లలో కలిపి పేస్ట్ చేసుకోవాలి. దాన్ని నలుపు ఉన్న కంటి చుట్టూ రాసుకుని పావుగంట తర్వాత కుడుక్కోవాలి. నెత్తిన చుండ్రు ఉన్న వాళ్లకు దురద మాములుగా ఉండదు. అంతేకాదు దుస్తులపైనా రాలి చాలా ఇబ్బందులు పెడుతుంది. దీని నుండి కూడా పరిష్కారం పొందవచ్చు. వేప ఆకులను నీల్లలో బాగా ఉడకబెట్టాలి. నెత్తికి షాంపు చేసుకున్న తర్వాత కాసేపు అయ్యాక కడుక్కోవాలి. అలాగే వేప ఆకుల పొడిని నీళ్లలో కలిపి పేస్టు చేసుకుని నెత్తికి పట్టించి, ఒక అరగంట తరువాత షాంపుతో స్నాణం చేస్తే ఫలితం ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *