విజయసాయిరెడ్డి..అయ్యన్నపాత్రుడు మధ్య ట్వీట్ల వార్..నీచమైన కామెంట్స్..!
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు మధ్య మళ్లీ ట్వీట్ల వార్ మొదలైంది. అది కూడా ఓ మంత్రి మృతిచెందిన అంశంపై ఇద్దరి మద్య వార్ నడిచింది. గెండెపోటుతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించిన దాని వెనక పలు అనుమానాలున్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ వెళ్లిన మంత్రి గౌతమ్ రెడ్డిపై సీఎం జగన్మోహన్ రెడ్డి, సలహాదారు ఫోన్లు చేసి చాలా ఒత్తిడి తెచ్చారని, దుబాయ్ పారిశ్రామిక ఎక్స్పోలో ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో మంత్రి విఫలమయ్యారని పదే పదే వేధించారని, అందువల్లే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మంత్రి మేకపాటి మృతి చెందారని అంతా అంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనికంతటికీ సీఎం జగన్, ఆయన సలహాదారులు కారణమని, తక్షణమే దీనిపై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పందిస్తూ..
‘ఒక నాయకుడు మరణిస్తే హుందాగా నివాళులు అర్పించాల్సింది పోయి.. నీచమైన కామెంట్స్ చేయడం టీడీపీ నేతలకే సాధ్యం. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి మాటలు వింటే…టీడీపీ మానసిక వైకల్యం అర్థమవుతోంది. పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పార్టీ. ఆర్ఐపీ వైజాగ్ టీడీపీ’ అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గట్టి కౌంటర్ ఇచ్చారు.
విజయయిరెడ్డి విమర్శలపై స్పందించిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తిరిగి కౌంటర్ ఇచ్చారు. ‘గురువింద కూతలు నువ్వే కూయాలి కసాయి! శవం దొరికితే రాజకీయం చేసే జగన్ రెడ్డి అండ్ కో కూడా నీతులు మాట్లాడటం విడ్డురంగా ఉంది’ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. ‘‘కోడెల మరణాన్ని రాజకీయం చేసి ఆత్మశాంతి లేకుండా వేదిస్తున్నారు. తను కొనుగోలు చేసిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అనర్హులు చేయకుండా వాడుకుని బాబు వదిలేశారు. నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు’’ అని కోడెల మరణాన్ని ఉద్దేశించి గతంలో విజయసాయిరెడ్డి పెట్టిన ట్విట్టర్ ను జతపరిచారు.