అరికాళ్ల పగుళ్లతో కలవరపడుతున్నారా.?

సుందరంగా మెరిసే చర్మం కోసం చాలా మంది రకరకాల  ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అంతేకాదు..రకరకాల క్రీములన్నీ రాస్తుంటారు. అంతా పై అందం చూసుకుంటారే తప్ప పాదాల రక్షణ మాత్రం గాలికి వదులుతారు. అడుగున ఉన్న ఈ కాళ్ల పగుళ్లు కనబడకుండా ఇబ్బందులు పెడతాయి. ఇక ప్యాంటు వేసుకునే వాళ్లకైతే వేసుకునేటప్పుడు, ఇడుకునేటప్పుడు ఇబ్బంది పెడుతుంది. సుతిమెత్తగా ఉండాల్సిన పాదాలు పగుళ్లుకు గురితీస్తే వచ్చే బాధేవేరు. అయితే దీనికి కొన్ని చిన్న‌చిన్న చిట్కాలు పాటించ‌డం వల్ల సులువుగా వాటిబారీ నుండి సులువుగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

పళ్లుతోముకునే మౌత్‌వాష్ పౌడ‌ర్‌ చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్‌లో నీటిని తీసుకుని కొంచెం మౌత్‌వాష్ పౌడ‌ర్‌ వేసుకుని కాళ్లను పావుగంట సేపు ఉంచాలి. అనంతరం పాదాలను శుభ్రం చేసుకోవాలి. తేనె కూడా పగిలిన పాదాలకు మంచి మందుగా పనిచేస్తుంది. పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత‌ శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు..కొబ్బ‌రి నూనె కూడా పగుళ్లకు పని చేస్తుంది. రాత్రిపూట నిద్రించేముందు పగిలిన చోట కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ నుండి ఉపశమనం కల్పిస్తుంది.

వెనిగర్‌ కలిపిన నీళ్లలో కూడా పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గిపోతాయి. ఓట్‌మీల్‌, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్ల బారీ నుండి తప్పించుకోవచ్చు. కాగబెట్టిన నీళ్లలో కొవ్వొత్తిమైనంను బాయిలింగ్ చేసి ఒక స్పూను ఆవనూనెను వేసి బాగా కలుపుకుని పగుళ్లవద్ద రాసుకుంటే పనిచేస్తుంది. ప్రతిరోజూ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పగుళ్లను నివారించవచ్చు.

గమనిక : వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *