ప్రపంచంలోనే ఎత్తయిన సైకిల్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Tallest Bicycle : మనం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల సైకిల్ లను చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు అప్ డేట్ అయినా జెనరేషన్ కారణంగా చాలామంది రకరకాల సైకిళ్లతో సోషల్ మీడియా ద్వారా బయట పడుతున్నారు. అదే తరుణంలో ఇప్పుడు ఓ వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.

Tallest Bicycle
Tallest Bicycle

అతని పేరు ఆడమ్. పోలాండ్ కి చెందిన అతనికి ఎత్తైన సైకిల్ తొక్కాలని ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో కానీ.. ఎలా అయినా ఎత్తయిన సైకిల్ తయారు చేయాలి అనుకున్నాడు. తనకు ఆ సైకిల్ ప్లాన్ అండ్ డిజైనింగ్ కి దాదాపు నెల రోజుల సమయం పట్టింది. దీన్ని తయారు చేయడానికి రీసైక్లింగ్ చేసిన వస్తువులు మాత్రమే ఉపయోగించాడు.

ఎట్టకేలకు కావాల్సిన విధంగానే సైకిల్ పనిచేసేలా సైకిల్ ను తయారు చేసుకున్నాడు. మొత్తానికి అతని కల నిజం చేసుకున్నాడు. కొండంత ఎత్తులో తయారుచేసిన ఆ సైకిల్ ను ఆడమ్ తొక్కుకుంటూ వెళుతుంటే.. చూసే వారు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఆ వ్యక్తి సైకిల్ తొక్కుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా లో ‘గిన్నిస్ వరల్డ్ రికార్స్’ అనే ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్ల రూపంలో ఆ వ్యక్తిని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో 63 వేలకు పైగా లైకులతో దూసుకు పోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *