బీస్ట్‌ మూవీ డైరెక్టర్‌పై విజయ్‌ తండ్రి ఫైర్‌.. ‘దీన్ని సినిమా అంటారా’ అంటూ..!

తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ నటించిన బీస్ట్‌ మూవీ ఈ మధ్యే రిలీజైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీకి నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ, మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఫైట్స్‌, సాంగ్స్‌.. అన్నీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో నెల్సన్‌ ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేదని అందరూ చెప్పుకొన్నారు. ఈనేపథ్యంలోనే ‘బీస్ట్‌’ డైరెక్టర్‌ నెల్సన్‌పై విజయ్‌ తండ్రి, దర్శకుడు చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఓ తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రశేఖర్‌ లైవ్‌లోనే నెల్సన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈయన వివిధ భాషల్లో 70 వరకూ సినిమాలు తీశాడు.

Thalapathy Vijay's father Chandrasekar blasts Beast director Nelson

“బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు పాత రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు ఎంతలా ఎంజాయ్ చేశారో.. నేను కూడా అంటే ఎంజాయ్ చేశాను. కానీ బీస్ట్‌ సినిమా కేవలం విజయ్‌ స్టార్‌డమ్‌ మీదే నడిచినట్లు ఉంది. సినిమాలో ఉగ్రవాదుల గురించి చెప్తున్నప్పుడు ఎంత పరిశోధించాలి. అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్‌ సబ్జెక్ట్‌ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్‌ ఉండాలి. ఆ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ కనిపించలేదు.. అసలు దీన్ని సినిమా అంటారా ..? అని అంటున్నారు అభిమానులు. దర్శకుడు మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది ఓ సారి అధ్యయనం చేసుంటే బాగుండేది. రా ఏజెంట్స్‌ ఏం చేస్తారు? ఎలా ప్రవర్తిస్తారు..? అనేది ఇంకాస్త పరిశీలించి చూపిస్తే సినిమా ఇంకా విజయం సాధించేది” అని చెప్పుకొచ్చాడు.

Thalapathy Vijay's father Chandrasekar blasts Beast director Nelson

సంగీత దర్శకుడు, ఫైట్‌ మాస్టర్‌, డ్యాన్స్‌ మాస్టర్‌, ఎడిటర్‌, హీరో.. వీళ్ల కారణంగానే ‘బీస్ట్‌’ విజయం సాధించిందని చంద్రశేఖర్‌ తెలిపారు. ‘బీస్ట్‌’ విజయంలో అందరి పాత్ర ఉందని తెలిపిన చంద్రశేఖర్‌.. నెల్సన్‌ పేరుని మాత్రం సినిమా విజయంలో భాగం చేయలేదు. కాగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *