కాంగ్రెస్‌ హయాంలోనే టెర్రరిస్ట్‌ దాడులు : ఎంపీ విజయసాయిరెడ్డి

దేశం విస్తుపోయే టెర్రరిస్టు దాడులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు వీలుగా అనుమానితులు, నేరస్తుల కొలతలు, బయోమెట్రిక్‌ నమూలను సేకరించే అధికారం పోలీసులు అంశంప బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ళు, 2008లో అస్సాంలో బాంబు పేలుళ్ళు, 2010లో పూణేలో బాంబు పేలుళ్ళు, 2011లో ముంబైపై కసాబ్‌ ముఠా దాడులు …దేశాన్ని నివ్వెరపరచిన ఈ టెర్రరిస్టు దాడులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయన్నారు.

చిదంబరం సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని,  ఈ బిల్లును మీరు సెలక్ట్‌ కమిటీకి పంపిచాలని కోరుతున్నారని, చిదంబరం మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపించారని ప్రశ్నించారు. చిదంబరం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు…చేసేవి తప్పుడు పనులు అని అన్నారు. చిదంబరం, గులాంనబీ అజాద్ కలసి తనపైనా, జగన్‌ మోహన్‌ రెడ్డిపైన తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. అలాంటి దుష్టచింతన కలిగిన చిదంబరం  నేడు సభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో టెర్రరిస్టుల పట్ల అనుసరించిన ఉదాశీన వైఖరి వల్లనే వాళ్ళు పేట్రేగిపోయారన్నారు. దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలతో గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం దృష్టిలో నాడు భారత్‌ బలహీనమైన దేశంగా ముద్రపడిందన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత టెర్రరిస్టుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారన్నారు. టెర్రర్‌ దాడులను ప్రోత్సహిస్తున్న పొరుగు దేశంపై సర్జికల్‌ దాడులు చేయడానికి కూడా మోదీ వెనుకాడలేదన్నారు. ప్రధాని అనుసరించిన విధానాల వలన దేశ భద్రతపై ప్రజలలో మళ్ళీ విశ్వాసం చూరగొందని ప్రశంసించారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *