దుమ్ములేపిన నాగార్జున.. బిగ్‌ బాస్‌ ఓటీటీ ప్రోమో రిలీజ్‌ !

బుల్లితెర సక్సెస్‌ఫుల్‌ షో బిగ్ బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలో వివిధ భాషల్లో బిగ్‌ బాస్‌ ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుంది. తెలుగులో ఇప్పటికి మొత్తం ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇటీవలే ముగిసిన ఐదవ సీజన్‌లో వీజే సన్నీ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. ఇప్పుడు కొంచెం ట్రెండ్‌ మార్చిన బిగ్‌బాస్‌.. సరికొత్తగా నెక్స్ట్‌ సీజన్‌ని ఓటీటీలో విడుదల చేస్తుంది. ఈసారి 24/7 ఈ షో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి తెలుగు ఓటీటీ లోగోను రిలీజ్‌ చేశారు. తాజాగా బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

Telugu bigboss ott promo

వెన్నెల కిశోర్‌ ఎంట్రీతో ప్రోమో స్టార్ట్‌ అవుతుంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీగా వెన్నెల కిషోర్… తన చివరి కోరికగా బిగ్‌బాస్ చూడాలంటూ ఫన్‌ క్రియేట్‌ చేస్తాడు. ఇక వకీల్‌సాబ్‌గా నాగార్జున అదరగొట్టారు. మురళీ శర్మ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ నాన్‌స్టాప్ బిగ్‌బాస్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి ప్రసారం కానున్నట్టు ప్రకటించారు. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ బిగ్‌ బాస్‌ ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఇలా ప్లాన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ షోలో ఒకప్పటి కంటెస్టెంట్స్ కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు టీవీలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్ల నుంచి కొందరు కంటెస్టెంట్స్ ను ఓటీటీ వెర్షన్ కోసం తీసుకున్నారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 5 నుంచి మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ ఓటీటీ వెర్షన్‌లో సందడి చేయనున్నారు. ముఖ్యంగా హిమజ, తేజస్వి, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలానే నటుడు తనీష్ కూడా కనిపించబోతున్నాడని సమాచారం. ఈసారి సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్స్ చాలా మంది కనిపిస్తారట. మరి రోజు మొత్తం టెలికాస్ట్ అయ్యే ఈ బిగ్‌బాస్‌ను జనాలు చూస్తారో లేదో..!

Add a Comment

Your email address will not be published. Required fields are marked *