ఉల్లిపాయ పొట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
Onion Peel: ఉల్లిపాయ.. కొంతమందికి ప్రతి రోజు వారు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకపోతే ముద్ద కూడా దిగదు. ఈ ఉల్లిపాయ కేవలం వంటకు మాత్రమే రుచినీ ఇవ్వడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు కలిగిస్తుంది. ఉల్లిపాయలు అనేక ఔషధ గుణాలతో పాటుగా పోషకాలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయలు ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఉల్లిపాయను మితిమీరి తీసుకోవడం వల్ల కూడా అదేవిధంగా అనర్థాలు కూడా ఉన్నాయి. అయితే కేవలం ఉల్లిపాయ తోనే కాకుండా ఉల్లిపొట్టు తో కూడా అనేకమైన అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఉల్లి పొట్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
ఉల్లిగడ్డ పొట్టు తీసిన తర్వాత చాలా మంది వాటిని చెత్తలో పడేస్తారు. కానీ వాటివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అలా చేయరు. టీ తాగే అలవాటు ఉన్న వారు కనీసం రోజుకు ఒక్కసారి అయిన ఉల్లి పొట్టును టీ లో కలుపుకుని తాగవచ్చు. ఉల్లిపాయ తొక్కలో విటమిన్ ఎ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఉల్లి తొక్క కంటిచూపును మెరుగు పరచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఉల్లి పొట్టును తరచుగా తీసుకోవడం వల్ల డ్రై స్కిన్ సమస్య కూడా దూరం అవుతుంది. అలాగే చర్మం పై కొత్త కణాలు కూడా ఏర్పడతాయి. దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల కాస్త ఉపశమనం ఉంది.
ఉల్లి తొక్క లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు వైరల్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఉల్లి తొక్క కలిపిన టీ తాగడం వల్ల గొంతునొప్పి కూడా నయమవుతుంది. ఉల్లి తొక్క వల్ల జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఉల్లి తొక్కల్ని నీటిలో మరిగించి ఆ నీటితో జుట్టు కడగడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అదే విధంగా జుట్టు సమస్య కూడా తగ్గుతుంది. ఉల్లి తొక్కలో ఉన్న సల్ఫర్ జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. వీటిని తరచుగా కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపొట్టు తో చేసిన టీ తాగడం వల్ల కాళ్లు నొప్పులు కండరాల నొప్పులతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. పులి తొక్కలను ఒక గ్లాసు నీటిలో వేసి 15 నిమిషాలు ఉడకబెట్టి ఆపై ఫిల్టర్ చేసి ఆపై రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.