కాపు కాసేందుకే ఆ నేతల సమావేశమా..?

ఏపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్ధం కాక రాజకీయ పరిశీలకులు కూడా జరుగుతున్న పరిణామానాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాపు నాయకుల్లో ఆయన చాలా ఫేమస్‌. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు కూడా. విషయం ఏదైనా.. లాభనష్టాలు భేరీజు వేసుకోవడంలో దిట్ట అనే పేరుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేసేముందు ఆయా నియోజకవర్గంలో బలాబలాలు క్షుణ్ణంగా అంచనా వేస్తారు. అందుకే ఇప్పటివరకు ఆయనకు ఓటమి లేదు. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ ఆయన ఉంటారన్న ఆరోపణ కూడా ఉంది. అంతటి గుర్తింపు సాధించిన ఆ మాజీ మంత్రి గంటా శ్రీనివాసేనని గంటాపథంగా చెప్పొచ్చు.

టీవల కాపు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారుతారా? ఉన్నచోటే ఉంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన టిడిపిని వీడరని, పార్టీ కోసమే పనిచేస్తారని ఆయనను దగ్గరగా గమనిస్తున్న వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన రాజకీయ కదలికలపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. అఇక 2021 డిసెంబర్ 20న పాయకరావుపేటలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ లో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర రాజకీయాలను శాసించబోయేది కాపులే అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.

వ్యాఖ్యల తర్వాత ఆయన వరుసగా కాపు నేతల సమావేశాల్లోనూ పాల్గొన్నారు. కొన్ని వారాల క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో కాపు నేతల సమావేశం జరిగింది. దానికి కొనసాగింపుగా నిన్న విశాఖలో మరొక సమావేశం జరుగింది. ఈ సమావేశంలో కాపు నేత‌ల‌తో గంటా శ్రీనివాస‌రావు స‌మావేశ‌మ‌య్యారు. విశాఖ‌ప‌ట్నంలోని ఓ ప్రైవేట్ హోట‌ల్ లో కాపు నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి త‌మిళ‌నాడు మాజీ సీఎస్ రామ్మోహ‌న్ రావుతో స‌హా మాజీ డీజీపీ సాంబ‌శివ‌రావు, జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, బోండా ఉమ,మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల్లో కాపు సామాజిక వ‌ర్గాన్ని సంఘ‌టితం చేయ‌డం,నిర్ణ‌యాత్మ‌క‌ శ‌క్తిగా ఎదిగేందుకు వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్నారు. గత నాలుగు గంటలు ఈ సమావేశం జరుగడం గమనార్హం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *