కాజల్ ప్రెగ్నెన్సీ విషయంలో అలా స్పందించిన సమంత!

Samantha-Kajal Pregnancy:  టాలీవుడ్ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తన అందం దాడితో ఎంతోమంది అభిమానులను గాయపరిచింది. చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటి గా ఓ వెలుగు వెలుగుతుంది.

Samantha-Kajal Pregnancy
Samantha-Kajal Pregnancy

ఇక ఈ అందాల భామ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూతో హిడెన్ ప్రేమాయణం నడిపి గత ఏడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకొని తన బాయ్ ఫ్రెండ్ ను భాగస్వామిగా చేసుకుంది. అప్పటి నుంచి కొన్ని సినిమాలకు మాత్రమే సైన్ చేస్తూ ఉంది. ప్రస్తుతం తన సినిమా షూటింగ్ లు పూర్తి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ.. భర్తే ప్రపంచంగా బ్రతుకుతుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. తన భర్తతో రొమాన్స్ జర్నీ చేసుకుంటూ ఆ పోస్టులను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో గౌతమ్.. కాజల్ ప్రెగ్నెన్సీ పై చిన్న క్లూ ను ఇన్ స్టా లో వదిలాడు. 2022 తమకు చాలా ముఖ్యమైన సంవత్సరం అని చెబుతూ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎమోజిని టాగ్ చేసాడు.

ఇక ఇటీవలే కాజల్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిడ్ ను కూడా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం గురించి సమంత కూడా ఇలా రియాక్ట్ అయ్యింది. ‘అవ్.. క్యూటీ లుక్ ఎట్ యు గ్లోయింగ్.. లాట్స్ అఫ్ లవ్ డియర్ కాజ్ సో సో ఎగ్జైటెడ్ ఫర్ యు లవ్ ఎమోజి’ అంటూ స్పందించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *