ఆర్ఆర్ఆర్ రికార్డ్ కలెక్షన్స్..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే తొలిరోజు కలెక్షన్లతో ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టి, మూడు రోజుల్లో రూ.500 కోట్లు వసూళ్లు చేసి సంచలనంగా మారిన ఈ సినిమా మరో కొత్త రికార్డు నమోదు చేసిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఏడు రోజుల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 710 కోట్లు (గ్రాస్) రాబట్టిందని, ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించిందని సినీ విశ్లేషకులు తెలిపారు. బ్రేక్ లేకుండా దూసుకుపోతున్న ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ సినిమాను మొత్తం ఐదొందల కోట్లతో నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్‌ని మరింత పెంచే పనిలో పడింది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. త్రీడీ వెర్షన్‌ను చాలా తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పుడు త్రీడీ థియేటర్లను పెంచుతున్నారు. అలానే కొన్ని చోట్ల టికెట్ రేట్లు తగ్గడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఉగాది పండగ ఉంది కాబట్టి ఈ వారాంతంలో ‘ఆర్ఆర్ఆర్’ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.
'RRR' IS UNSTOPPABLE, UNSHAKEABLE… *#Worldwide* Week 1 Gross BOC: ₹ 710 cr… *#India* Gross BOC: ₹ 560 cr… Next to #Baahubali2. #RRR #RRRMovie pic.twitter.com/4F2M7kjflp
— taran adarsh (@taran_adarsh) April 1, 2022
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి స్వరాలు అందించారు. అలియాభట్ , ఒలీవియా మోరీస్ కథానాయికలుగా మెప్పించగా… శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రల్లో కనిపించారు.