అరికాళ్ల మంటలు అలవోకగా తగ్గించుకోండిలా..
అనారోగ్యం పాలుగాకుండా ఉండేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కసారి అనారోగ్యం పాలైతే ఇక ఆ సమస్యలు నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. ఒక సాధారణ వయసు నుండి పైబడిన వారు అరికాళ్ల మంటలతో బాధపడతారు. ఇది పైకి కనబడకపోయినా కాలు కింద పెడితే వేధనకు గురవ్వాల్సిందే. దాని నుండి ఎలా ఉపశమనం పొందాలో చూద్దాం..చాలామందిలో కారణం లేకుండానే అరికాళ్లు మంటలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో అరికాళ్ళ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఈ సమస్య వల్ల అరికాళ్ళలో పుండ్లు కూడా ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది చాలా నొప్పి గా ఉంటాయి. అందుకే రాకుండా ఉండడానికి విటమిన్ బీ 12 ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో విటమిన్ బి 12 లోపం అధికంగా ఉన్నప్పుడు అరికాళ్ళలో ఉన్న నాడులు దెబ్బతింటాయి. దీని వల్ల అరికాలు మంటలు సంభవిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే విటమిన్ బి 12 ఉండే ఆహారాలు అధికంగా తీసుకోవడం చాలా మంచిది.
అలాగే అతిగా మద్యం తాగి వాళ్ళలో కూడా నాడులు దెబ్బతిని అరికాళ్ళు మంట పుడుతాయి. ఇలా జరిగినప్పుడు నాడులోని ఒక చిన్న ముక్కను తీసుకొని పరీక్షలు చేయిస్తారు. రక్త ప్రసరణ లో ఇబ్బందులు లాంటివి కూడా అరికాలు మంట పుట్టడానికి కారణమవుతాయి. విటమిన్ బి 12 లభించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఈ విటమిన్ బి గుడ్లు, చేపలు, మాంస కృత్తులు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఏమీ తీసుకున్నా మోతాదులో మాత్రమే తీసుకోవాలి.