చరిత్ర సృష్టించిన భీమ్లా నాయక్.. బాక్సాఫీస్ రికార్డ్‌..!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి ఓ మాస్‌ ఫాలోయింది ఉంది. ఆయన సినిమా రిలీజ్‌ అంటే అభిమానులకు ఇక పండగే. సినిమా విడుదలకి కొద్ది రోజుల ముందే హంగామా ఉంటుంది. తాజాగా పవన్‌-రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్‌ సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

pawan-kalyan-bheemla-nayak-all-time-record

‘భీమ్లా నాయక్’ మూవీ ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలకు ముందు నుంచే నెలకొన్న హైప్ థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొల్పింది. తొలి రోజే భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు జనమంతా థియేటర్ల బాట పట్టారు. దీంతో కలెక్షన్స్ పరంగా తొలి రోజే ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్ సినిమాకి వెన్నెముకగా మారిందని అందులోనూ థమన్ అందించిన సంగీతం ఇంకా పవన్ కళ్యాణ్, రానాల నటన ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా మార్చిందని చెప్పుకోవచ్చు.

pawan-kalyan-bheemla-nayak-all-time-record

మొదటిరోజు ఒక్క నైజాంలోనే 11.85 కోట్ల షేర్ వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది “భీమ్లా నాయక్”. గతంలో 11.44 కోట్ల తో “పుష్ప” సినిమా రికార్డు సృష్టించగా, ఈ రికార్డుని బ్రేక్ చేసింది “భీమ్లా నాయక్”. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత ఇప్పుడు పుష్ప రెండవ స్థానంలో నిలవగా మూడవ స్థానంలో సాహోసినిమా 9.41 కోట్లతో నిలిచింది. బాహుబలి 2 చిత్రం 8.9 కోట్లు వసూలు చేయగా, వకీల్ సాబ్ 8.75 కోట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోని టికెట్ రేట్లు తగ్గడంతో కలెక్షన్లు కూడా కొంచెం నెమ్మదించాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *