అనిల్ అవినీతి తేల్చే వరకు నిద్రపోం : కోటంరెడ్డి
నెల్లూరు నుడా పరిధిలో అక్రమ లేఅవుట్ల కు కొమ్ముకాస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంతు తేల్చే వరకు నిద్ర పోయేది లేదని నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు మూడవ మైలు పరిధిలో మంత్రి ముఖ్య అనుచరుడు వైసీపీ నేత పొలం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి వేసిన అక్రమ లే అవుట్ కు సంబంధించి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1.86 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి 80 అడుగుల కాలవ, పెన్నా పొర్లు కట్టలు, పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి నాలుగు ఎకరాల వరకు అడ్డగోలుగా అమ్మకాలు చేశారని దీనివెనుక కోట్లాది రూపాయలు చేతులు మారాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు వేసేవారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని విమర్శించారు. ప్రతి లే ఔట్ లో అనిల్ కు వాటా ఉందని ఆరోపించారు. నుడా పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లేఅవుట్లు వేసిన వారికి మద్దతుగా అనిల్ కుమార్ యాదవ్ ఏడు శాతం అపరాధ రుసుము చెల్లించాలా జీవో తీసుకొని వస్తున్నాడని దీనిని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని ప్రకటించారు. గత మూడేళ్ల మంత్రి పదవి నీ అడ్డంపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడిన అనిల్ ను జైలుకు పంపే వరకు విస్తరించి ఉందని ప్రకటించారు..
మంత్రి అనిల్ కు దమ్ము ధైర్యం ఉంటే గత మూడేళ్లుగా అనిల్ హయాంలో వివిధ పనుల్లో జరిగిన అవినీతి తన 11 నెలల చైర్మన్గా ఉన్న హయాంలో జరిగిన పనులపై పూర్తిస్థాయి విచారణకు సిద్ధంగా ఉన్నాయని అందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ బహిరంగ సవాల్ విసిరారు… గత మూడేళ్లుగా అధికారం వెలగబెట్టిన మాజీ మంత్రి అనిల్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కాలవ స్థలం, పెన్నా పోరంబోకు స్థలాలు ఆక్రమిస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ తో సహా అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు ఆర్డీవో, ఎమ్మార్వో ,రిజిస్టర్ లను కోర్టుకి లాగుతామని హెచ్చరించారు.