భారీగా రేట్లు తగ్గించిన నెట్ ఫ్లిక్స్.. వినియోగదారులకు ఊరట!

ప్రస్తుత కాలంలో ఓటీటీలలో సినిమా చూసే వారి సంఖ్య అధికంగా ఉండడంతో చాలామంది నెట్ ఫ్లిక్స్, అమెజాన్, ఆహా వంటి వాటిని సబ్స్క్రిప్షన్ చేసుకుని వారికి నచ్చిన సినిమాలు వెబ్ సిరీస్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ప్రేక్షకులు ఎక్కువగా వీటికి అలవాటు పడటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ రేట్ పెంచగా అందుకు విరుద్ధంగా నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేటు భారీగా తగ్గించింది. ఈ క్రమంలోనే సబ్స్క్రిప్షన్ రేట్లను తగ్గించి ఎంతోమంది వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

మొన్నటి వరకు నెట్ ఫ్లిక్స్ స్మార్ట్ ఫోన్, ట్యాబ్ ల‌లో చూడాలంటే నెలకు 199 రూపాయలు చార్జీలు వసూలు చేసేవారు.అయితే ఇక నుంచి ఈ ప్యాకేజ్ లో నెట్ ఫ్లిక్స్ నెల‌వారీ చార్జీ 149 రూపాయ‌ల‌కు త‌గ్గింది.ఇక స్మార్ట్ ఫోన్, ట్యాబ్ ల‌తో పాటు టీవీ, కంప్యూట‌ర్ల‌లో కూడా నెట్ ఫ్లిక్స్ చూడ‌టానికి ఇది వ‌ర‌కూ 499 చెల్లించుకోవాల్సి ఉండేది ఇకపై వీటిలో కూడా 199 లకు మాత్రమే చూసే అవకాశాన్ని కల్పించింది.

అయితే ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో కన్నా నెట్ ఫ్లిక్స్ ధర అధికంగా ఉండేది. కానీ అమెజాన్ సబ్స్క్రిప్షన్ రేట్లు పెరగడం ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేటు తగ్గడంతో ఈ రెండు ధరలు సమాంతరంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇలా నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధర తగ్గించడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *