వామ్మో.. వెలుగులోకి వచ్చిన మరో కొత్త వైరస్.. ఎంత ప్రమాదమంటే!
Neo Cov: గత రెండేళ్లుగా దేశం మొత్తం కరోనాతో అవస్థ పడుతూ వచ్చింది. ఇక కొంతకాలం దీని బాధ తగ్గింది అనుకునే లోపు ఒమిక్రాన్ పేరుతో మరో కొత్త వైరస్ ప్రారంభమైంది. ప్రస్తుతం దీని ప్రభావం దేశంలో బాగానే ఉంది. ఇక తాజాగా మరో ప్రమాదకరమైన కొత్త వైరస్ వచ్చిందని తెలుస్తుంది. ఇంతకు అది ఏంటి.. ఎక్కడ నుండి వ్యాపించిందో.. దాని ప్రభావం ఎంత ఉందో చూద్దాం.
తాజాగా చైనాలో వూహాన్ శాస్త్రవేత్తలు మరో కొత్త వైరస్ సమాచారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ వైరస్ దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ ద్వారా రూపాంతరం చెందిందట. తీవ్రస్థాయిలో దీని ప్రభావం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని బట్టి ‘నియో కోవ్’ అనే వైరస్ మనకు కొత్తేమీ కాదని తెలుస్తుంది.
ఈ వైరస్ ను 2012, 15 ఆ సంవత్సరాల మధ్య కనుగొన్నారు. ఈ నియోకోవ్ వైరస్ ను మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికా లో కనుగొన్నారు. వైరస్ గబ్బిలం నుండి మనుషులకు సోకుతుందని భావించారు. గబ్బిలాలకు సంబంధించిన వైరస్ ఇంకా వ్యాప్తి చెందడం ద్వారా మనుషులలో కూడా విస్తరించడానికి కారణమవుతుందని కనుగొన్నారు.
కరోనా వ్యాధి కారకం, ACE2 రిజిస్టర్ తో కలవడం వల్లనే కరోనా వైరస్ ప్రభావం చూపుతోందని పరిశోధకులు తెలుపుతున్నారు. కాబట్టి మనలో చాలామంది శ్వాసకోస సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అణువులు నియోకోవ్ నుండి రక్షించుకోలేమని స్పష్టమయ్యింది. ఇక చైనా పరిశోధకుల ప్రకారం ఈ వైరస్ హై పోటెన్సయల్ కాంబినేషన్ ను కలిగి ఉందట.