ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని మోదీ సర్కారు ఫిక్స్ అయ్యినట్లుందే?
ఆంధ్రరాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత.. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పింది అప్పటి కేంద్రం. కానీ, ఇంత వరకు ఆ విషయం మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి కానీ.. అమలు విషయంలో ఎలాంటి స్పందన కనిపించడం లేదు. సాక్ష్యాత్తు దేశ ప్రధాని పార్లమెంటు సాక్షిగా ఈ విషయంపై మాట ఇచ్చి.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా ఇచ్చిన మాట తప్పడం ఒక్క మన దేశంలోనే సాధ్యమోనే అనిపించేంతలా మోదీ ప్రభుత్వం వ్యవహించడం వ్యవహరించడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తోంది.
ఏ దేశంలో కూడా కీలక అంశాలపై ప్రభుత్వాలు ఇచ్చిన హామీని వ్యతిరేకిస్తే అందుకు తగ్గ పరిణామాలు ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, మోదీ ప్రభుత్వం ఏపీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో వ్యవహిస్తున్న వైఖరిని చూస్తుంటే.. అసలు ఆయన ఏ ధైర్యంతో ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. ఇలానే ఉంటే ఆంధ్రా ప్రజల ఆగ్రహానికి మోదీ గురికావడం ఖాయమని అర్థమవుతోంది. ఇప్పటికే, రాష్ట్రంలోని నాయకులతో పాటు, ప్రజలు కూడా మోదీ వైఖరిని తప్పుబడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తానని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాటను.. మోదీ గద్దెనెక్కినప్పుడు మర్చిపోవడం ఏంటని.. ఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన అది నెరవేర్చే బాధ్యత కేంద్రంపై ఉందని తెలేదా? అంటూ విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు మాటను మార్చి.. ఆంధ్రా ప్రజల కడుపుకొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరిగినా.. ఆ సమయంలో ఏపీ ప్రత్యేక హోద అంశం లేవనెత్తితే చాలు.. అది ముగిసి అధ్యాయమంటూ చెప్తున్నారు. అందుకు భిన్నంగా కేంద్రం స్వరాన్ని వినిపిస్తూ.. తాజాగా, బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లుగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన ప్రకటన హాట్‌టాపిక్‌గా మారింది. అవసరమైన రాష్ట్రానికి ఇచ్చిన మాట పక్కన పెట్టి.. ఇప్పుడు పక్క రాష్ట్రం వైపు తొంగిచూడటంతో మోదీ సర్కారుపై ఆంధ్రా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. గత దశాబ్దంగా బిహార్‌లో ఆశించిన అభివృద్ధి సాధించినప్పటికీ.. రాష్ట్రంలో కాస్త వెనకబాటుతనం ఉండటంతో ఇత రాష్ట్రాలకు సమానంగా ముందంజలో ఉండే విధంగా ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నటలు వివరించారు. మరి ఈ విషయంపై ఏపీ అధికార, విపక్ష నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.