భీమ్లా నాయక్‌ టీంకి చిరు స్పెషల్‌ విషెస్.. వీడియో వైరల్

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్‌ మూవీ భీమ్లా నాయక్‌ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్‌ చిరంజీవి నుంచి ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. ఈ వీడియోను పోస్ట్‌ చేసి అభిమానులకు  సర్‌ప్రైజ్‌ ఇచ్చారు రామ్‌ చరణ్.

‘భీమ్లానాయక్‌’ సినిమా షూట్‌ గత కొన్నిరోజుల ముందు వరకూ నిర్విరామంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు.  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రీకరణ కూడా కొన్నిరోజులపాటు అక్కడే జరిగింది. ఇటీవల భీమ్లా నాయక్‌, గాడ్‌ ఫాదర్‌ సినిమాల షూటింగ్‌ ఒకే చోట జరగడంతో చిరంజీవి ఖైదీ డ్రెస్‌లోనే భీమ్లా నాయక్‌ మూవీ సెట్‌కి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా రానా, పవన్‌ కల్యాణ్‌, సాగర్‌ కే చంద్ర, త్రివిక్రమ్‌లతో ఫొటోలు కూడా దిగారు. అలాగే భీమ్లా నాయక్‌ టీం కూడా రీసెంట్‌గా గాడ్‌ ఫాదర్‌ సెట్‌లో సందడి చేసింది. రానా, త్రివిక్రమ్‌, పనన్‌ కల్యాణ్‌, సాగర్‌ కే చంద్ర, గాడ్‌ ఫాదర్‌ మూవీ సెట్‌కు వచ్చి కాసేపు చిరుతో ముచ్చటించారు. ఇద్దరు మెగా బ్రదర్స్ సెట్‌లో ఒకేచోట కనిపించేసరికి అందరి ఫోన్లు క్లిక్ మన్నాయి. చిరు ఖైదీ డ్రెస్‌లో ఉండగా, పవన్ పోలీస్ డ్రెస్‌లో ఉన్నారు. వీడియోలో వారిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది.  వీరిద్దరి వీడియోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

పవన్ కళ్యాణ్ తో పాటూ రానా, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర కూడా చిరును సెట్లో కలిశారు. చిరుకు కలిసొచ్చిన ఖైదీ నెంబర్ 786 నెంబర్ నే గాడ్ ఫాదర్లో కూడా ఉపయోగించారు. గాడ్ ఫాదర్ సినిమాను రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పవన్‌ సినిమా రేపు విడుదల కానుంది. భీమ్లానాయక్‌ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ రామ్‌ చరణ్‌ పోస్ట్‌ చేసిన వీడియోను చిరు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ మెగా బ్రదర్స్‌ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *