నా తమ్ముడు వంగవీటి రాధా మేలిమి బంగారం- కొడాలి నాని
ఏపీ మంత్రి కొడాలి నాని వంగవీటి మోహన రంగ తనయుడు వంగవీటి రాధాను పొగడ్తలతో ముంచెత్తారు. వంగవీటి రాధా బంగారమని, కాస్త రాగి కలిపితే.. ఎలా కావలంటే అలా మల్చుకోవచ్చని అని చెప్పినా రాధా ఒప్పుకోలేదని అన్నారు. అప్పటి టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ ఇప్పిస్తామని ఆయనకు పదవి ఆశ చూపించినా వాటిని ఏమాత్రం ఆశించకుండానే ఆ పార్టీలో చేరారరని.. నాన్ని అన్నారు. తన తమ్ముడు రాధా మేలిమి బంగారమని పొగడ్తలతో ముంచెత్తారు నాని.
మరోవైపు వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడిన రాధా.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తతను చంపేందుకు రెక్కీ నిర్వహించారని అన్నారు. నేను దానికి భయపడనని అన్నారు. వారు ఎవ్వరో త్వరలో తెలుస్తుందన్నారు. రంగా గారి అబ్బాయిగా జనంలోనే ఉంటా, జనంతో ఉంటానన్నారు. ఎవ్వరు ఏ వెదవ వేషాలు వేద్దామని చూసిన అది జరగదన్నారు. తన అభిమానులు కూడా అలాంటి వారికి దూరంగా ఉండాలని వంగవీటి రాధా అన్నారు.
రాధా చేసిన ఆరోపణలు ఎవ్వరి మీద అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కొడాలినాని, వల్లభనేని వంశీ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా, కొడాలని నాని స్పందించి.. పై వ్యాఖ్యలు చేశారు.