ఈ నీరు తాగితే యవ్వనంగా కనిపిస్తారట.. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకోండి!

కేవ్రా వాటర్ కేవలం వంటలలో ఉపయోగించడానికి మాత్రమే కాకుండా తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వాటర్ బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా కలగజేస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వాటర్ మన శరీరంలో ఉన్న టిష్యూలకి రక్తప్రసరణ సరిగా జరిగేలా చేసే కార్డియో టానిక్ లా కూడా హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేసి హాట్ మజిల్ యొక్క కాంట్రాక్షన్ ని రికవర్ చేస్తుంది.కేవ్రా వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వాటర్ లో మలినాలను శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. ఇందువల్ల పొల్యూషన్, వెదర్ వంటి వాటి మూలంగా ముఖం పై పడే డస్ట్ పార్టికల్స్ ని ఇది శుభ్రంగా తీసేస్తుంది. ఆ వాటర్ లో ముంచిన దూదితో ఫేస్ పై మృదువుగా రుద్దితే ఫేస్ పూర్తిగా క్లీన్ అవుతుంది. అలాగే యాక్నె, డై స్కిన్, సోరియాస్ లో ఉండే ఫీలింగ్, ఎగ్జిమా వంటి వాటి వల్ల వచ్చే దురద మచ్చలు వాటిని తగ్గిస్తుంది. దురద,మచ్చలు వాటిని తగ్గించేందుకు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ హెల్ప్ చేస్తాయి.ఎర్రగా మారి స్కిన్ ని మామూలు రంగులోకి తెస్తాయి. ఈ నీరు సహజమైన స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది.

ఇది ఫోర్స్ ని ఓపెన్ చేసి పోషకాలు లోపలికి వెళ్లేలా చేస్తుంది. దీనితో డల్ గా ఉన్న స్కిన్ గ్లో గా తయారవ్వడమే కాకుండా ఫ్రెష్ గా కూడా కనిపిస్తుంది.కేవ్రా వాటర్ లో ముందే చెప్పినట్లుగా ఫీనాల్స్, కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి టాక్సిన్స్ ని బయటకి పంపేసి, ఫ్రీ ర్యాడికల్స్ యొక్క డ్యామేజ్ ని తగ్గిస్తాయి. ఇవి స్కిన్ ని లోపలి నుండీ బయట నుండీ కూడా శుభ్రపరుస్తాయి. ఫలితంగా ముడతలు, ఫైన్ లైన్స్, చర్మం సాగిపోవడం వంటివి అదృశ్యమయిపోతాయి. యూత్‌ఫుల్ స్కిన్ మీ స్వంతమవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *