పోలీసులను నిలదీసిన జనసేన నేతలు
విజయవాడలోని పోలీసులు తీరుపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్లెక్సీలను ఎందుకు తొలగించారని మండిపడ్డారు. వైసీపీకి కొమ్ముకాయొద్దని హెచ్చరించారు. వివరాళ్లోకి వెళ్తే సోమవారం మంగళగిరికి సమీపంలోని ఇప్పటంలో జనసేన 8వ ఆవిర్భావ సభకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విజయవాడ నుండి మంగళగిరి వరకు జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కృష్ణవారధి దగ్గర కరెంట్ పోల్స్ కు కట్టిన కట్టిన ప్లెక్సీలను పొలీసులు తొలగించడాన్ని ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చూశారు.
దీంతో కారు దిగిన ఆయన పోలీసులతో వ్వాగ్వాదానికి దిగారు. ఇదికాస్త జనసేనా వర్సెస్ పోలీస్ వ్యవహారంగా మారిపోయింది. జనసేన ఆవిర్భావ సభకోసం కట్టిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారని, పోలీసులే కాపలా కాస్తూ బ్యానర్లు తొలగిస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. పోలీసులు జనసేన నేతలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులే ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నారని నాదెండ్ల మనోహర్ వారితో గొడవకు దిగారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారంటూ నాదేండ్ల ఆరోపించారు.
జనసేన ఆవిర్భావ సభ కోసం విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అధికారులు తొలగించడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ప్లెక్సీలను తొలగించకుండా జనసేన ప్లెక్సీలనే ఎందుకు తొలగిస్తున్నారని, జనసేన అంటే వైసీపీకి భయామా అని ప్రశ్నించారు. వారధిపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జనసేన నేతలకు సర్ధిచెప్పడంతో గొడవ సర్ధుమనిగింది.