దేశంలో తొలిసారిగా 93ఏళ్ల వృద్ధుడికి రోబోట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించిన చెన్నై అపోలో హాస్పిటల్
చెన్నై అపోలో హాస్పిటల్స్‌లో 93ఏళ్ల రోగికి రోబోట్ అసిస్టెడ్ సర్జీరిని విజయవంతంగా నిర్వహించారు. భారతదేశంలో 93ఏళ్ల వృద్ధుడికి రోబోట్ గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన హాస్పిటల్‌గా చెన్నై అపోలో ఘనత సాధించింది. డాక్టర్ ఎమ్.ఎమ్ యూసుఫ్ బృందం ఈ సర్జరీని విజయవంగా పూర్తి చేసినట్లు అపోలో వర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్‌లోని కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ఎమ్ఎమ్ యూసుఫ్ మాట్లాడుతూ రోబోటిక్ అసిస్ట్ (CABG) అనేది ఇప్పుడు అందుబాటులో ఉన్న అతి తక్కువ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ అని అన్నారు. ఛాతి భాగంలో చిన్న రంధ్రం చేసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు.
రోగులు త్వరగా కోలుకుని తమ సాధారణ కార్యకలాపాలు చేసుకునేందుకు ఎంతో వీలుగా ఉంటుందని అన్నారు. ఈ ప్రత్యేకమైన ఆపరేషన్ ప్రపంచంలోనే చాలా తక్కువ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ, రోగుల ప్రయోజనం కోసం భారతదేశానికి సరికొత్త వైద్య సాంకేతికతను పరిచయం చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఈతరహా రోబోట్ అసిస్టెడ్ సర్జరీ సాంప్రదాయ గుండె శస్త్రచికిత్స చేయించుకోలేని అనేక మంది వ్యక్తుల జీవితాలను మారుస్తుందని, ఇది వారికి ఓ వరమని తెలిపారు.