చంద్రబాబు ముందుకు వస్తే టీడీపీతో కలిసి పోరాటం చేస్తాం : సీపీఎం రాఘవులు

కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయిందని సీపీఎ: పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. అంతకు ముందు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొక్కుబడిగా బీజేపీ గెలిచిందన్నారు. దేశంలో మత కల్లోలాలను సృష్టించాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగలను వేదికగా చేసుకుని సంఘ్ పరివార్ శక్తులు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ప్రజలను విడదీయాలని చూస్తుందని, బీజేపీ ,సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని తీర్మానం చేశామని తెలిపారు. రాష్ట్రంలో దురదృష్టవశాత్తు అన్ని పార్టీలు బీజేపీకి వంత పాడుతున్నాయన్నారు.

జనసేన పార్టీ ఏకంగా భాజపా తో కలిసి పని చేస్తోందని, టీడీపీ, టీడీపీ ,జనసేన లౌకిక పార్టీలో కాదో తేల్చుకోవాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచిందన్నారు. చెత్త పై పన్ను, ఆస్తి పన్ను పెంపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపిందని, పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయం లో కేంద్రం రెండు ముక్కలు చేసి పావు వంతు మాత్రమే ఇస్తామని చెప్తుందని విమర్శించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు, విద్యుత్ ప్లాంట్ల ప్రైవేటీకరణ వంటివి కేంద్రం చెప్పినట్టు రాష్ట్రం చేస్తుందన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు పంపిణీని వ్యతిరేకించాలని, ఇది చాలా ప్రమాదకరమైన అంశమని వివరించారు. రేషన్ బదులు నగదు పంపిణీ అంగీకార పత్రాలపై ప్రజలు సంతకాలు చేయొద్దని, భవిష్యత్తులో నగదు కూడా రాని పరిస్థితి వస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి, కేంద్రం చెప్పినవన్నీ వైసీపీ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. నెల్లూరు కోర్టులో ఆధారాలు దొంగిలిస్తే ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల అనుమతి లేనిదే కోర్టులో దొంగతనం జరుగుతుందా  అని, మేము కాంగ్రెస్‍తోనే కలిసాము.. చంద్రబాబు ముందుకు వస్తే టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *