చలికాలంలోనూ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండిలా!
మెరిసే అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం కావాలంటే కృతిమంగా కాకుండా సహజం సిద్ధమైన నూనెలతో అందంగా మృదువుగా కోమలత్వంగ సొంతం చేసుకోవచ్చు. నూనెలు కేవలం జుట్టు సంరక్షణకు మాత్రమే ఉపయోగపడతాయి అని చాలామంది భావిస్తారు. నూనెలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మసౌందర్యాన్ని, జుట్టు సౌందర్యాన్ని మెరుగు పరచడంతో పాటు శరీరానికి కూడా మేలు చేస్తాయి. శరీర నొప్పితో బాధపడుతున్నవారు ఆలీవ్ నూనెతో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది. అయితే చర్మాన్ని తాజాగా ఉంచి ముడతలు పడకుండా సౌందర్యంగా ఉంచేందుకు నూనెలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనెను అధికంగా జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నూనెను చర్మ సౌందర్యానికి కూడా చక్కగా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్స్ కారణంగా దెబ్బతిన్న చర్మ కణాలను తిరిగి పునరుద్ధరణ చేయడానికి కొబ్బరినూనె చక్కగా సహాయపడుతుంది.అలానే చర్మ రంధ్రాలను శుభ్రపరిచి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.ఆలివ్ నూనెలో అధిక మొత్తంలో విటమిన్లు, మినరల్స్ జుట్టు, చర్మ సంరక్షణను కాపాడుతాయి.అలానే చర్మానికి తగిన పోషకాలు అందించి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. ఈ నూనె పసిపిల్లల చర్మానికి మరింత మృదుత్వాన్ని అందిస్తాయి.
పొడిబారిన చర్మానికి తగినంత తేమను అందించి తాజాగా ఉంచుతుంది. బాదం నూనె ఒక మంచి మసాజ్ ఆయిల్ ఈ ఆయిల్ చర్మానికి రాసుకుంటే దురద, మంట, అలర్జీ వంటి అన్ని చర్మ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. వారానికొకసారైనా ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా మృదువుగా తయారవుతుంది. నువ్వుల నూనె మంచి బాడీ మసాజ్ ఆయిల్ ఈ నూనె చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మాన్ని కోమలంగా మార్చుతుంది. రోజు స్నానానికి ముందు ఈ నూనెతో మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.